iDreamPost
android-app
ios-app

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే తమ్ముడు

  • Published May 11, 2020 | 4:29 AM Updated Updated May 11, 2020 | 4:29 AM
  • Published May 11, 2020 | 4:29 AMUpdated May 11, 2020 | 4:29 AM
పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే తమ్ముడు

లాక్ డౌన్ వేళ ప్రముఖులు జూదం లో మునిగి తేలుతున్నారు. పేకాట లో ప్రతి రోజూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తమ్ముడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో ఓ ఇంటిలో పలువురు ప్రముఖులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దాడి చేసి వారిని అదుపులోకి తీసుకోగా.. వారిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డి ఉన్నారు.

గండ్ర వెంకటరమణారెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భూపాలపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఆరునెలలకు 2019 ఏప్రిల్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గండ్ర వెంకటరమణా రెడ్డి అధికార పార్టీ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 14 మధ్య ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చీఫ్ విప్ గా పని చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet