అధికారుల పొరపాటా? లేక నిర్లక్షమా?

సచివాలయ సిబ్బంది చేసిన పొరపాటో లేక ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రభుత్వం ఇచ్చే అధికారిక ఉత్తర్వుల్లోనే పలు తప్పులు దొర్లుతున్నాయి.

ముందుగా శనివారం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.. తర్వాత సోమవారం క్యాబినెట్ సమావేశం అంటూ ఇచ్చిన ఆదేశాల్లో తప్పులు దొర్లాయి. 2020 డిసెంబర్ 20వ తేదీన క్యాబినెట్ సమావేశం అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 2020 జనవరి నెలకు బదులు ఏకంగా నెలనే మార్చేస్తూ డిసెంబర్ అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే శనివారమే సమావేశం వార్తలు వచ్చాయి.. అయితే అందులోనూ క్లారిటీ లేదు. ఆ వెంటనే శనివారం రోజున జరగాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారానికి వాయిదా పడినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే ఒక్క మంత్రిమండలి సమావేశానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంలో రెండు మూడు తప్పులు ఎందుకు జరుగుతున్నాయనేదే ఇప్పుడు ప్రశ్న. అవే తప్పులు ప్రజలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో గానీ, పాలసీల విషయంలో గాని, ముఖ్యమైన జీవోల విషయంలో గాని జరిగితే చిన్న తప్పు అయినా పర్యవసానం ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది.. కాబట్టి సచివాలయ అధికారులు సిబ్బంది ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. కొన్ని పొరపాట్ల వల్ల ఏకంగా ప్రభుత్వానికే నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Show comments