iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్‌ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి గంగుల

కొత్త రేషన్‌ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి గంగుల

నూతన రేషన్‌ కార్డుల జారీపై జరుగుతున్న ప్రచారాలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. నూతన రేషన్‌ కార్డుల జారీపై కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ తప్పుడు ప్రచారాల్ని నమ్మొద్దని అన్నారు. సోషల్‌ మీడియాతో పాటు ఇతర వాటిల్లో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పని అన్నారు. ఇప్పటికే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అది అవాస్తవమని, ఆ అసత్య ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని సూచించారు. ఇంకా రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కాలేదని వెల్లడించారు.

ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొన్ని పోస్టర్లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం పోస్టర్లే కాదు.. వీడియోలు, వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలని క్లారిటీ ఇచ్చారు. మరి, కొత్త రేషన్‌ కార్డుల జారీపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మంత్రి గంగుల కమలాకర్‌ క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.