Idream media
Idream media
ఉడికీ ఉడకని లేదా ముద్దయిన అన్నం.. నీళ్ల సాంబారు, బాతు గుడ్డు సైజులో ఉండే కోడి గుడ్డు.. ఇదీ నిన్నటి వరకు ఆంధప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు తింటున్న ఆహారం. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన దాదాపు సగానికి సగం మంది విద్యార్థులు క్యారేజీ తెచ్చుకునే పెడుతున్న ఆహారం మెనూలో భారీ మార్పులు చేటుచేసుకోబోతున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబోయే మధ్యాహ్న భోజన మెనూను ప్రకటించారు. సీఎం ప్రకటించడంతో ఇక బడుల్లో నాణ్యమైన, రుచికరమైన భోజనం విద్యార్థులకు అందనుంది.
చిత్తూరులో అమ్మ ఒడి ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సంక్రాంతి పండుగ తర్వాత ఈ మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. ఆరు రోజుల పాటు విభిన్నమైన తరహా భోజనం అందించేలా ఉన్న మెనూను విద్యార్థులు, తల్లి దండ్రుల హర్షధ్వానాల మధ్య సీఎం వెల్లడించారు.
మెనూ ఇదీ..
సోమవారం – అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ
మంగళవారం – పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం – వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
గురువారం – కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం – అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
శనివారం – అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్