iDreamPost
android-app
ios-app

బ్యాంకాక్ లో చరణ్ బిజీ బిజీ

  • Published May 14, 2018 | 12:14 PM Updated Updated May 14, 2018 | 12:14 PM
బ్యాంకాక్ లో చరణ్ బిజీ బిజీ

“రంగస్థలం” తో ఈ సంవత్సరం భారీ హిట్ ను సాధించారు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్. “భరత్ అనే నేను”తో సంచలన విజయాన్ని అందుకున్నారు నిర్మాత డీ వీవీదానయ్య. ఇప్పుడు విరుద్దరి కలయికలో ఒక చిత్రం తెరకెక్కుతోందన్న విషయం అందరికి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాస్  డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం బ్యాంకాక్‌ లో బీజీగా ఉంది. ఈ చిత్ర 15రోజుల షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుగుతుండటం విశేషం. ఇక షూటింగ్ విరామంలో దానయ్యతో కలిసి చెర్రీ ఫోటోకు ఫోజిచ్చాడు.  వైట్ కలర షర్ట్స్‌, కూలింగ్ గ్లాసెస్‌తో ఇద్దరు దిగిన ఫోటో ఇప్పుడు నెట్ లో సందడి చేస్తోంది..ఇక ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్‌గా  కైరా అద్వాని నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.