iDreamPost
android-app
ios-app

మిస్ ఇండియా నుండి సివిల్స్ వైపు అడుగులు.. తొలి ప్రయత్నంలోనే విజయం

ఐశ్వర్యం ఉన్నచోట అందముందని సరదాగా పెద్దలు అంటుంటారు. కానీ ఈ ఐశ్వర్యకు ఈ మాటలు వర్తించవు. ఆమె అందగత్తె. మిస్ ఢిల్లీతో పాటు ఇతర టైటిల్స్ గెలిచింది. మిస్ ఫైనలిస్టుగా నిలిచింది.

ఐశ్వర్యం ఉన్నచోట అందముందని సరదాగా పెద్దలు అంటుంటారు. కానీ ఈ ఐశ్వర్యకు ఈ మాటలు వర్తించవు. ఆమె అందగత్తె. మిస్ ఢిల్లీతో పాటు ఇతర టైటిల్స్ గెలిచింది. మిస్ ఫైనలిస్టుగా నిలిచింది.

మిస్ ఇండియా నుండి సివిల్స్ వైపు అడుగులు.. తొలి ప్రయత్నంలోనే విజయం

మనం ఒకటి అనుకుంటే.. భగవంతుడు మరో స్క్రిప్ట్ రాస్తాడని ఊరకనే అనలేదు. ఇదిగో ఈ అమ్మాయి విషయంలో సరిగ్గా సరిపోతుంది. గ్లామర్ రంగంలో రాణించాలనుకుంది. అటుగా అడుగులు వేసింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫైనలిస్టుగా కూడా ఎంపికైంది. కానీ అనూహ్యంగా సివిల్స్ వైపుకు వెళ్లింది. తొలి ప్రయత్నంలో విజయం సాధించి ఔరా అనిపించింది. రాజస్తాన్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిణి ఐశ్వర్య షియోరాన్ ఇన్ స్పిరేషనల్ స్టోరీ ఇది. తల్లి కోసం ఓ రంగాన్ని ఎంచుకుంటే.. తాను మరో రంగంలో స్థిరపడింది. ఇందులో విశేషమేమిటంటే.. ఆమెకు తెలంగాణతో ఇటీవల అనుబంధం ఏర్పడింది. ఆమె తండ్రి అజయ్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్‌లోని 9వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్‌లో కమాండింగ్ ఆఫీసర్.

తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతోనే ఆమెను కూడా దేశానికి సేవ చేసే సివిల్స్ వైపు అడుగులు పడేలా చేసింది. ఐశ్వర్య తన ప్రాథమిక విద్యాభ్యాసం చాణ్యకపురిలోని సంస్కృతి పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ కోసం ఢిల్లీకి వెళ్లింది. 12వ తరగతిలో 97. 50 శాతం మార్కులు తెచ్చుకుంది. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పుడే అందాల పోటీల్లో పాల్లొంది. 2014లో మిస్‌ క్లీన్‌ అండ్‌ కేర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌తో పాటు ,2015లో మిస్ ఢిల్లీ కిరీటాన్ని కైవంసం చేసుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలకు వెళ్లింది. 2016లో జరిగిన పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. అమ్మ కల తీర్చేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి.

దీని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టింది. 2018లో IIM ఇండోర్‌లో సీటు వచ్చింది.. కానీ చేరలేదు. మోడలింగ్ రంగం నుండి ప్రజలకు సేవ చేయాలని తలచింది. సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యింది. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా అన్ని ప్రిపేర్ చేసుకునేది. అలా తొలి ప్రయత్నంలోనే UPSCలో 93వ ర్యాంక్‌ను సాధించింది. 10 నెలల పాటు కఠోర దీక్ష చేసినట్లే చదివింది. ఆమె కృషికి తగ్గ ప్రతి ఫలం లభించింది. సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం 10+8+6 టెక్నిక్‌ ఫాలో అయ్యానని చెబుతుంది ఐశ్వర్య. అంటే పదిగంటలు చదువు, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర పనులు చక్కబెట్టేదానన్ని చెబుతుంది. IFS అధికారిగా ఎంపికైన ఈ అమ్మాయి.. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. సాధించాలన్న తపన ఉండాలే కానీ.. ఎంతటి కఠోర పరీక్షల్లో అయినా రాణించొచ్చు అని నిరూపించింది ఐశ్వర్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి