19 నుంచి ఆటోలు, కార్లు, లారీల బంద్?

తెలంగాణలో మరోసారి బంద్ పాటించనున్నారు ఆటోలు, కార్స్, లారీల యాజమాన్యాలు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే, ఫిట్నెస్ చార్జీల రూపంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. రోజు వారిగా రూ. 50 పెనాల్టీ విధిస్తున్నరని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రవాణా చెయ్యడం చాలా కష్టంగా మారిందని లారీ డ్రైవర్ల మాట‌. అదనపు చార్జీలు వెయ్యడం కరెక్ట్ గాదని అంటున్నారు. వాహనాలపై గ్రీన్ టాక్స్ , లైఫ్ టాక్స్ తో పాటు ఫిట్నెస్ ఛార్జీల పెంపడాన్ని నిరసిస్తూ తాము ఈ నెల 19వ తేదీ నుంచి బంద్ పాటిస్తున్నామని ప్ర‌క‌టించారు. ఈ బంద్ లో ఆటోలు, క్యాబ్స్ డ్రైవర్లు పాల్గొంటారు. రెండేళ్ళుగా ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో జరిమానాలు ఎలా వేస్తారు? వెంటనే ప్రభుత్వం, రవాణా శాఖ స్పందించి టాక్స్ లు, పెనాల్టీ లు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show comments