Dharani
సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సీఎం జగన్.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా లబ్ధిదారులకు లక్షన్నర రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఆ వివరాలు..
సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సీఎం జగన్.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా లబ్ధిదారులకు లక్షన్నర రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఆ వివరాలు..
Dharani
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సంక్షేమ పాలన కోసం నవరత్నాల పేరుతో అనేక పథకాలను తీసుకు వచ్చారు. జగన్ సర్కార్ పథకాలపై పక్క రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాక ముఖ్యమంత్రులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో మార్పుల కోసం రూపొందించిన నాడు-నేడు, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వంటి నిర్ణయాలను అమెరికా ప్రముఖులు సైతం ప్రశంసించారు. ఎప్పటికప్పుడు వినూత్న సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తోన్న సీఎం జగన్.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. మహిళా సాధికారిత లక్ష్యంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. దీని కింద ఒక్కొక్కరికి లక్షన్నర వరకు ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు..
మహిళా సాధికారత దిశగా.. కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు శుభవార్త చెప్పారు. సొంత కాళ్లపై నిలబడాలనుకునే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు గాను సీఎం జగన్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు తమ కాళ్లపై తాను నిలబడేలా.. ఆటోలు కొనుక్కుని వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు.
సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమంలో భాగంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం అప్పుగా ఇవ్వనుండగా.. కేవలం పది శాతం డబ్బులు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మంజూరు చేసిన రుణానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు
సాధారణంగా అయితే.. ఆటోల కొనుక్కోవాలనేవారు ప్రైవేట్ సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటారు. ఈ మొత్తాన్ని.. నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా భారం అవుతోంది. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అనగా డిసెంబరు 6వ తేదీన తొలుత ఈ పథకం కింద కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేయనున్నారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి.. వారికీ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులైన మహిళలు తాము తీసుకున్న మొత్తం రుణాన్ని 48 నెలలు వాయిదాల రూపంలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున.. మొత్తం 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతను అందించనుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి.. వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ సమయంలో భద్రతతో పాటుగా ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.