iDreamPost
android-app
ios-app

భార్య కావాలంటూ ఆటోకు హోర్డింగ్ పెట్టి వినూత్న ప్రచారం

  • Published Feb 19, 2024 | 8:36 PM Updated Updated Feb 19, 2024 | 8:36 PM

నాకు పెళ్లి కావాలంటూ ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

నాకు పెళ్లి కావాలంటూ ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

  • Published Feb 19, 2024 | 8:36 PMUpdated Feb 19, 2024 | 8:36 PM
భార్య కావాలంటూ ఆటోకు హోర్డింగ్ పెట్టి వినూత్న ప్రచారం

సోషల్ మీడియా వచ్చిప్పటి నుంచి రక రకాల వార్తలు, వీడియోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని మనం కనీ వినీ ఎరుగని వీడియోలు, ఫోటోలు చూసే అవకాశం లభిస్తుంది. ఎంతోమంది ఔత్సాహికులు తమ టాలెంట్ తో ఎన్నో రకాల వీడియోలు తీస్తూ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదిస్తున్నారు. మరికొంతమంది వినూత్నమైన ప్రయోగాలు, కార్యక్రమాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనకు భార్య కావాలంటూ వినూత్న ప్రచారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

తనకు భార్య కావాలంటూ ఒక హోర్డింగ్ పై తన వివరాలు, ఫోటో పెట్టి ఆటోలో ఉంచాడు. తనకు వధువు కావాలని ఈ వినూత్న ప్రచారంతో మొదలు పెట్టాడు. ఆటో ఎక్కిన వాళ్లు, చుట్టు పక్కల వాళలు ఈ హోర్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యప్రదేశ్ లోని దామెహ్ లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీపేంద్ర రాథోడ్ (29) తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఒక మంచి వధువు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. భార్య కావాలి అంటూ తన పూర్తి వివరాలు హోర్డింగ్ పై రాసి ఎటక్ట్రిక్ ఆటోకు ఏర్పాటుచేశాడు. తన పుట్టిన తేది, సమయం, బ్లడ్ గ్రూప్, ఎత్తు, విద్యార్హతలు, గోత్రం అన్ని వివరాలు ఆ హూర్డింగ్ పై పేర్కొన్నాడు.

ఈ హోర్డింగ్ విషయంపై దీపేంద్ర మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో మహిళల కొరత వల్ల వధువు దొరకడం లేదు. నా తల్లిదండ్రులు నిత్యం ఏదో ఒక పూజ కార్యక్రమాల్లో నిగమ్నై ఉంటున్నారు. అందుకే నాకు వధువును వెతకలేకపోతున్నారు. ఈ మధ్యనే నేను మ్యారేజ్ గ్రూప్ లో కూడా చేరాను. కానీ నాకు ఎలాంటి వధువు దొరకలేదు. వయసు దాటిపోతుంది.. అందుకే ఆటోకు నా పూర్తి వివరాలతో హూర్డింగ్ పెట్టాను. నాకు కుల, మత బేధాలు లేవు, పేదరికంలో ఉన్నా పరవాలేదు. ఎవరైనా యువతులు పెళ్లి ప్రతిపాదనతో నన్ను సంప్రదించవొచ్చు. నేను నా భార్యను సంతోషంగా చూసుకుంటాను’ అని అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet