iDreamPost
android-app
ios-app

Ravi Teja Mega154 మాస్ మెగా కాంబోలో ట్విస్టులివే

  • Published Jul 16, 2022 | 5:33 PM Updated Updated Jul 16, 2022 | 5:41 PM
Ravi Teja Mega154 మాస్  మెగా కాంబోలో ట్విస్టులివే

రెండు నెలల క్రితమే లీకైనప్పటికీ మళ్ళీ ఉంటుందో లేదో అనే అనుమానాల మధ్య వాల్తేర్ వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ గా మాస్ రాజా సెట్ లోకి వచ్చి క్యారవాన్ లో ఉన్న చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలి వెళ్లే వీడియోని ఇందాక విడుదల చేశారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మాస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిరు చిత్రం కూడా ఇదే. వరస రీమేక్స్ మీద ఉన్న మెగాస్టార్ చేస్తున్న స్ట్రెయిట్ మూవీగా ఫ్యాన్స్ దీని మీద ఎక్కువ అంచనాలు పెట్టేసుకున్నారు.

ఇక దీనికి సంబంధించిన కొన్ని కీలక లీకులు బయటికి వచ్చాయి. వాటి ప్రకారం రవితేజ ఇందులో చిరు తమ్ముడిగా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. భార్యగా క్యాథరిన్ త్రెస్సాతో పాటు ఓ చిన్న పాప ఈ జంటకు ఉంటుంది. వాల్తేర్ లో చేపలు పట్టుకుని బ్రతికే వీరయ్యకు ఖాకీ చొక్కా వేసుకున్న తమ్ముడికి మధ్య లింక్ ఎలా ఉండబోతుందన్నది స్క్రీన్ మీదే చూడాలి. శ్రీలంక నుంచి వలస వచ్చిన జాలర్ల నేపధ్యం ఇందులో ఉండొచ్చని వినికిడి. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ని ఇందులో సెట్ చేస్తున్నారు. జనవరి 2023 విడుదలని ముందే చెప్పేశారు కాబట్టి ఈ మెగా మాస్ కాంబోని చూడాలంటె ఇంకొక్క ఏడు నెలలు వేచి చూస్తే సరిపోతుంది.

సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీకి వెంకీ మామ జస్ట్ యావరేజ్ అయ్యిందే తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే గ్యాప్ తీసుకుని మరీ ఈ వాల్తేర్ వీరయ్యని సెట్ చేసుకున్నారు. టైటిల్ అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ పలు ఇంటర్వ్యూలలో బాబీ చిరు ఇద్దరూ లీక్ చేసేశారు. ఊర మాస్ అవతారంలో వింటేజ్ మెగాస్టార్ ని చూడొచ్చని నిర్మాతలు గతంలో ఊరించారు. దానికి తగ్గట్టు ఉంటే మాత్రం ట్యాగ్ లో చెప్పుకుంటూ వచ్చినట్టు పూనకాలు గ్యారెంటీ. ఆచార్య గాయాల నుంచి బయటికి రావాలని చూస్తున్న మెగా ఫాన్స్ కు దసరాకి గాడ్ ఫాదర్ పలకరించగా తక్కువ గ్యాప్ లో వీరయ్య మాస్ ని చూడొచ్చు

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş