iDreamPost
iDreamPost
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన ఆల్టో అవతారం మార్చుకుంది. ఆగస్ట్ 18, 2022న కొత్త ఫీచర్స్, కొత్త కలర్స్ తో రానుంది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ఆల్టో పెద్దది, పవర్ ఫుల్. సెలెరియో ఫీచర్స్ కూడా కొత్త ఆల్టోలో ఉన్నాయి.
2022 మారుతి సుజుకి ఆల్టో ధర
కొత్త తరం మారుతి సుజుకి ఆల్టో ధర రూ. 4.15 లక్షలు – రూ. 4.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంటే ఎస్-ప్రెస్సో కన్నా రేటు తక్కువ. లాంచ్ అయిన తర్వాత కొత్త ఆల్టో, రెనాల్ట్ క్విడ్ , మారుతి ఎస్-ప్రెస్సోతో పోటీపడుతుంది. S-ప్రెస్సో రూ. 4.25 లక్షలుంటే, క్విడ్ రేటు రూ. 4.64 లక్షల నుండి ప్రారంభం
ఆల్టో ఎక్స్‌టీరియర్స్ , ఇంటీరియర్స్
పెద్ద గ్రిల్ , పెద్ద స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లతో రానుంది. ఇంటీరియర్స్ పరంగా, ఇది సెలెరియో , ఎస్-ప్రెస్సోలోని బెస్ట్ ను తీసుకుంది. ఆల్టో పొడవు పెరిగింది. కాబట్టి క్యాబిన్ స్పేస్ కూడా పెరిగినట్లే. డ్యాష్‌బోర్డ్ , సెంట్రల్ కన్సోల్ ఆధునికంగా తయారైంది. కొత్త వెర్షన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో మెయిన్ ఎట్రాక్షన్. ఆల్టో కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ కూడా రావచ్చునన్నది ట్రేడ్ అంచనా.
మారుతి 800cc ఆల్టో, 1-లీటర్ ఇంజన్ ఆల్టో K-10 రెండు వెర్షన్స్ లో ఆల్టో రావచ్చు. పాత BS6 వెర్షన్‌తో సమానంగా పవర్ ఉంటుంది. లీటర్ ఇంజన్ వేరియంట్ కి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండనుంది.
రెండు దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో ఎక్కువమంది మెచ్చిన కార్లలో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టోది మొదటి స్థానం. 2022 ఆల్టో పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దిన కార్. ఇది కొత్త ఛాసిస్‌పై ఆధాపడింది. లోపలా, బైటా కొత్త రూపంలో లాంచ్ కానుంది. పాత ఆల్టోతో పోలిస్తే కొత్త కార్ పొడువు ఎక్కువ, ఫీచర్స్, పవర్ కూడా ఎక్కువే.
కొత్త ఆల్టో S-Presso, WagonR, Celerio, Swift, Dzire, Ignis, Baleno, Ertiga , XL6లకు కారణమైన మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్(modular Heartect platform)పై తయారైంది మారుతున్న భత్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఛాసిస్, ఎలాంటి ప్రమాదంలోనైనా కార్ ని పటిష్టంగా ఉంచుతుంది. కొత్త హ్యాచ్‌బ్యాక్ మంచి డ్రైవింగ్ అనుభవాన్ని, రైడింగ్ క్వాలిటీని ఇస్తుంది.