Idream media
Idream media
తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు సూత్రధారి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో మారుతీరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రెండేళ్ల క్రితం కూతురు అమృత దళితుడైన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో కిరాయి హంతకులతో అల్లుడిని మారుతీరావు దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అరెస్టయిన మారుతీరావు పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదలయ్యాడు.
బైయిల్ పై విడుదలైన తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్ళటానికి చేసిన ప్రయత్నాలను అమృత అంగీకరించక పోవటంతో విఫలమయ్యాయి. జరిగిందేదో జరిగింది,ప్రణయ్ హత్య కేసును బలంగా ముందుకు తీసుకువెళ్లవద్దని,నీ బిడ్డ భవిశ్యత్తుకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తామని మధ్యవర్తులు చేసిన రాజీ ప్రయత్నాలను కూడా అమృత తిరస్కరించింది.
ఆవేశంలో కూతురి భర్తను చంపించినా కోపం తగ్గినా తరువాత మనోవ్యధకు గురయ్యారో కానీ మారుతీరావు ఈ ఉదయం ఖైరతాబాద్ లోని ఆర్య భవన్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అదుపు లేని ఆవేశం రెండు కుటుంబాలలో విషాదం నింపింది.. మారుతీరావు ఉదంతం నుంచి సమాజం నేర్చుకోవాలసింది చాలా ఉంది.
Also Read:మిర్యాలగూడ మారుతీరావు షెడ్ లో మరో మిస్టరీ
మరో వైపు కొద్దిరోజుల క్రితం మారుతీరావు వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని శవం లభ్యమైంది. ముఖం గుర్తు తెలియనిదిగా కుళ్లిపోయి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.ఈ కేసుతో మారుతి రామ్ కు సంబంధం ఉన్నది లేనిది విచారణలో తెలవలసిఉన్నది కానీ ప్రాధమికంగా మారుతి రావ్ మీద అనుమానాలు నమోదు కాలేదు .