iDreamPost
android-app
ios-app

పెళ్ళిలో ఫోటో గ్రాఫర్ లేడని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

  • Published May 31, 2022 | 1:39 PM Updated Updated May 31, 2022 | 1:39 PM
  • Published May 31, 2022 | 1:39 PMUpdated May 31, 2022 | 1:39 PM
పెళ్ళిలో ఫోటో గ్రాఫర్ లేడని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

మన పెళ్లి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ఫోటోలకు, వీడియోలకు ఎక్కువ ఖర్చు పెట్టి మరీ స్పెషల్ ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. తాజాగా పెళ్లికి ఫోటో‌గ్రాఫర్‌ను పెట్టలేదని, ఫోటోలు తీయట్లేదని ఏకంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఓ వధువు.

ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా మంగళ్‌పూర్ లో నివసించే ఓ రైతు కుమార్తెకు భోగ్నిపూర్ లో నివసిస్తున్న వ్యక్తితో వివాహం ఫిక్స్ చేశారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు వాళ్ళు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ని పెట్టాలి. పెళ్లి కూతురు తరపున ఆ కుటుంబం చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారు. వరుడు ఉరేగింపుతో రాగానే కళ్యాణ మండపానికి ఆహ్వానం పలికారు.

మరికొద్దిసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా అబ్బాయి తరుఫు వాళ్ల బృందంలో ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ లేరని వధువు గమనించింది. దీంతో ఈ పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది ఆ వధువు. అంతేకాక కల్యాణమండపం నుంచి ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఇరు వర్గాలు ఆమెను ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు. నాతో ఈరోజు జరిగే పెళ్లి జ్ఞాపకాల గురించే పట్టించుకోని వాడు రేపు జీవితంలో నాగురించి పట్టించుకుంటాడా, నన్ను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంచుతాడా అంటూ ప్రశ్నించింది.

దీంతో పెళ్లి కొడుకు వాళ్ళు పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లారు. అక్కడ కూడా వధువు ఈ పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పోలీసుల మధ్యవర్తిత్వంలో ఇరువర్గాలు ఇచ్చిపుచ్చుకున్న కానుకలు వెనక్కు తిరిగి ఇచ్చేశారు. దీంతో ఫోటోగ్రాఫర్ లేని కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయినా ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

 

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet