iDreamPost
android-app
ios-app

దారుణం: అవురా అన్నందుకు ప్రాణం తీసేశారు!

అవురా అన్నందుకు కొందరు వ్యక్తులు ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముగ్గురిపై కేసు నమోదు అయింది.

అవురా అన్నందుకు కొందరు వ్యక్తులు ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముగ్గురిపై కేసు నమోదు అయింది.

దారుణం: అవురా అన్నందుకు ప్రాణం తీసేశారు!

నాగరికత ఎంత అభివృద్ధి చెందినా.. శాస్త్ర సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా.. కులం, మతం, ప్రాంతం అన్న విషయాల్లో మాత్రం భారతీయులు ఇంకా వెనుకబడే ఉన్నారు. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు కులం కోసం.. మతం కోసం.. ప్రాంతం కోసం కొట్టుకు చస్తున్నారు. ముఖ్యంగా కుల వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా కుల హత్యలు ఎక్కువగా ఉత్తర భారత దేశంలో జరుగుతూ ఉంటాయి. తక్కువ జాతి వాళ్లు అని నిందిస్తూ చిన్న చిన్న తప్పులకే ప్రాణాలు తీసిన సంఘటనలు చాలా జరిగాయి.

కానీ, దక్షిణ భారత దేశంలో ఇలాంటివి చాలా తక్కువ జరుగుతుంటాయి. తాజాగా, తెలంగాణలో ఓ దారుణం చోటుచేసుకుంది. తనను అవురా అన్నాడన్న కోపంతో  కొందరు వ్యక్తులు ఒకతడ్ని కడుపులో గుద్దారు. దీంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి సంపత్‌ ఈ నెల 26వ తేదీన రాత్రి కోడిగుడ్ల కోసం షాపుకు వెళ్లాడు.

youn man dead

సంపత్‌ షాపు దగ్గరకు చేరుకునే సమయానికి వీరబోయిన సతీశ్‌, పంది మహేశ్‌, అలుగునూరి అరుణ్‌ అనే వ్యక్తులు అక్కడే ఉన్నారు. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌ను సంపత్‌ అవురా అని అన్నాడు. దీంతో మిగిలిన వారికి కోపం వచ్చింది. తక్కువ కులం వాడివి రా అంటావా అంటూ అతడిపై దాడి చేశారు. సంతప్‌ కడుపుపై పిడి గుద్దులు గుద్దారు. ఇంటికి వెళ్లిన సంపత్‌కు కడుపునొప్పి పెరిగింది. దీంతో కుటుంసభ్యులు అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ ఉన్న సమయంలో నొప్పి పెరగటంతో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం చెన్నూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి డాక్టర్లు ఆయన్ని మంచిర్యాలకు రెఫర్‌ చేశారు. సంపత్‌ ఓ అక్కడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. సంపత్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. సంపత్‌ తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందుతులు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకుశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

కాగా, ఈ మధ్య కాలంలో కులం పేర్లతో దూషించుకోవటాలు.. కొట్టుకోవటాలు బాగా పెరిగాయి. సోషల్‌ మీడియాలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి, అవురా అన్నందుకు సంపత్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.