iDreamPost
android-app
ios-app

మనందరికోసం అంటూ ప్రజలముందుకు టాలీవుడ్ స్టార్లు..

మనందరికోసం అంటూ ప్రజలముందుకు టాలీవుడ్ స్టార్లు..

ప్రపంచదేశాలతో పాటు మన దేశాన్ని కూడా కరోనా వైరస్ వణికిస్తుంది..మన దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రధాని మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ కర్ఫ్యూ కి మన తెలుగు రాష్ట్రాలు కూడా మద్దతు ప్రకటించాయి.

కాగా రేపు జరగబోయే జనతా కర్ఫ్యూకి మన సినిమా స్టార్లు కూడా మద్దతు ప్రకటించారు. అందులో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ప్రతి అరగంటకి ఒక స్టార్ చొప్పున 28 మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు లైవ్ లో తెలుగు రాష్ట్ర ప్రజలను పలకరించనున్నారు.

మనందరికోసం అంటూ 14 గంటలపాటు జరిగే ఈ లైవ్ లో 28 మంది సినిమా స్టార్లు లైవ్ ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటలకు మంచులక్ష్మితో మొదలైన ఈ కార్యక్రమం రాత్రి 9 గంటలకు దగ్గుబాటి రాణా లైవ్ తో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్ కూడా ట్విట్టర్ లో వదిలారు..

మనమంతా స్వచ్చందంగా లాక్ డౌన్ చేసుకుందాం.. కర్ఫ్యూ జరుగుతున్న సమయంలో ప్రతి అరగంటకి ఒక్కొక్కరు చొప్పున మేము మీతో మాట్లాడుతూ ఉంటాం అని ట్వీట్ చేశారు. కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూకి టాలీవుడ్ సెలెబ్రెటీలు మద్దతు ప్రకటించి తెలుగురాష్ట్రాల ప్రజల ముందుకు లైవ్ లో రావడం ప్రశంసనీయం.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet