iDreamPost
android-app
ios-app

పెళ్లి రద్దు చేసుకున్న యువతి ఫ్యామిలీ! రాత్రి పొలంలోకి వెళ్లి..

పెళ్లి రద్దు చేసుకున్న యువతి ఫ్యామిలీ! రాత్రి పొలంలోకి వెళ్లి..

పెళ్లి అనేది నూరేళ్ల పంట. అందుకే పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గుణ,గణాలు, ఇతర విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది ఎంతో జాగ్రత్తగా తమ బిడ్డలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. కొన్ని సార్లు నిశ్చార్థం జరిగిన తరువాత.. వియ్యం అదుకోబోయే వారికి సంబంధించి.. పలు విషయాలు తెలుస్తాయి. ఈ క్రమంలో పెళ్లిని కూడా రద్దు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలానే ఓ వ్యక్తి .. తన కుమార్తె జరగాల్సిన పెళ్లిని రద్దు చేశాడు. మరుసటి రోజు తెల్లవారు జాముకు గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోని 850 చెట్లను నరికేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్త వివరాల్లోకి వెళ్తే..

కర్నాటక రాష్ట్రం, మైసూర్ జిల్లా హుణసూరు తాలుకాలోని మణుగనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే రైతు పొలాన్ని నాశనం చేశారు.  వెంకటేశ్ పండిస్తున్న వక్కతోటను ధ్వసం చేశారు. ఇక బాధితుడు వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన కుమార్తె సించనను అదే గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి ఇవ్వాలని  పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే ఇరుకుటుంబాలు నిశ్చితార్థం సైతం నిర్వహించాయి.  అయితే పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తరువాత అశోక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

దీంతో వెంకటేశ్ కుమార్తెకు.. అశోక్ పై విరక్తి వచ్చేసింది. అతడి చేసుకోనంటూ వెంకటేశ్ కి యువతి తెలిపింది.  దీంతో  అశోక్.. యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన అశోక్ కుటుంబ సభ్యులు.. వెంకటేశ్ కుటుంబంతో గొడవ పడినట్లు సమాచారం. అనంతరం పెళ్లి రద్దు చేసుకున్నారని.. వెంకటేశ్ కుటుంబపై పగ పెంచుకున్నారు. రాత్రికి రాత్రే వెంకటేశ్ మూడు ఎకరాల పొలంలోకి వెళ్లి.. అల్లం, వక్కచెట్లను నరికేశాడు. తమ పొలాన్ని అశోక్ ధ్వంసం చేశాడని బాధితుడు ఆరోపించాడు.

అలానే ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఈ వీరిపై మీ ఫిర్యాదు ఇచ్చాము. అప్పుడే పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బాధితుడు వాపోయాడు. తమకు.. నిందితుడి నుంచి ప్రాణహాని ఉందని వెంటేశ్ తెలిపాడు. మరి.. పెళ్లి రద్దు చేసుకున్నారని పగ పెంచుకుని ఈ ఘటనకు పాల్పడిన ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన యువతి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş