iDreamPost
android-app
ios-app

అదృష్టం అంటే ఇది.. కేరళ లాటరీలో రూ.25 కోట్లు గెల్చుకున్న వ్యక్తి!

అదృష్టం అంటే ఇది.. కేరళ లాటరీలో రూ.25 కోట్లు గెల్చుకున్న వ్యక్తి!

మనకు ఏదైనా దక్కాలంటే ఆవగింజంత అయినా అదృష్టం ఉండాలని పెద్దలు అంటారు. అలా అదృష్టం తన్నుకొచ్చిన రోజు కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అలానే ఓ వ్యక్తికి అదృష్ణ లక్ష్మి లాటరీ రూపంలో తలుపు తట్టింది.  లాటరీలో ఏకంగా రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు. కేరళలో ఓనం పండుగ సందర్భంగా ‘తిరుఓనం బంపర్‌ బీఆర్‌-93’ పేరుతో లాటరీ టికెట్లను విక్రయించారు. వాటికి సంబంధించిన లక్కీ డ్రా బుధవారం బుధవారం జరిగింది. ఓ వ్యక్తికి మొదటి బహుమతిగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెల్చుకోవడం కేరళ లాటరీ చరిత్రలోనే ఇదే తొలిసారి.

సాధారణంగా కేరళలో లాటరీ టికెట్ల విక్రయాలు, లాటరీల లక్కీ డ్రాలు తీస్తూనే ఉంటారు. ఇక తిరుఓనం, విషు, క్రిస్మస్ వంటి పెద్ద పెద్ద పండగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ పెద్ద ఎత్తున లాటరీలను విక్రయిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే  ప్రతి ఏటా మాదిరిగానే  ఈ ఏటా కూడా తిరుఓనం పండగ సందర్భంగా తిరుఓనం బంపర్  బీఆర్-93 పేరుతో టికెట్లను జారీ చేశారు. ఈ లాటరీ టిక్కెట్లను భారీ సంఖ్యలో అక్కడి ప్రజలు కొనుగోలు చేశారు. ఈ బంపర్‌ బీఆర్‌ 93 లాటరీలో మొత్తం 66 లక్షల టికెట్లను విక్రయించారు.  బుధవారం ఈ లాటరీలకు సంబంధించి లక్కీ డ్రా నిర్వహించారు. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో జరిగిన లాటరీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ 2023కి సంబంధించిన బంపర్ లాటరీలో విజేతలను ప్రకటించారు.

ఈ లక్కీ డ్రాలో తొలి విజేతకు ఏకంగా రూ.25కోట్ల బహుమతి దక్కింది. అందులో టికెట్‌ నంబర్‌ TE 230662 మొదటి బహుమతి కింద ఎంపికైంది. దాంతో అది కొనుగోలు చేసిన వ్యక్తికి ఈ రూ. 25 కోట్ల గెల్చుకున్నాడు. ఇక ఇదే డ్రాలో మరో 20 మందికి రెండో బహుమతి లభించింది. రెండో విజేతకు రూ. కోటి అందజేశారు. ఇక మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు దక్కనున్నాయి. మరోవైపు.. నాలుగో బహుమతి కింద రూ.5 లక్షలు చొప్పున  అందజేశారు. ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెల్చుకోవడం కేరళ లాటరీ చరిత్రలోనే ఇదే తొలిసారి. మరి.. రూ.25 కోట్లు గెల్చుకున్న ఈ అదృష్టం వంతుడిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.