iDreamPost
android-app
ios-app

భార్య వింత కోరిక… తీర్చేందుకు భర్త ఏం చేశాడంటే!

భార్య వింత కోరిక… తీర్చేందుకు భర్త ఏం చేశాడంటే!

భార్యాభర్తల  బంధం అనేది ఎంతో గొప్పది. వేరు వేరు మనసత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే ఓ బంధంతో ఒకటవుతారు. అలానే ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు తెలుసుకుని ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటారు. అయితే కొందరు తమ భాగస్వామి మనస్సులో ఉండే కోరికలను తెలుసుకుని.. సడెన్ సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి.. తన భార్య మనస్సులోని కోరికను తెలుసుకుని.. దానిని నిరవేర్చాడు. భర్త ఇచ్చిన సర్ ఫ్రైజ్ బహుమతికి సదరు మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి  మెరైన్  ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి సుభాష్ ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతను ఉద్యోగం రీత్య ఆరు నెలల పాటు సముద్రంలోనే ఉంటూ విధులు నిర్వహించే వాడు. అలానే విధుల్లో భాగంగా వివిధ దేశాలకు కూడా ఓడల్లో వెళ్తుండే వాడు. అతడికి సుబశ్రీ అనే  మహిళ వివాహం జరిగింది. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.  భర్త చేస్తున్న విధులపై  సుబశ్రీ తెలుసుకుంది. ఆమె కూడా రోజుల తరబడి ఓడల్లో ప్రయాణించాలే కోరిక కలిగింది. ఆమె అదే విషయాన్ని తన భర్తకు తెలియజేసింది.

కానీ సుభాష్ కార్గో షిష్ లో పని చేస్తున్నందున్న… తన భార్యను తనతో పాటు తీసుకెళ్లే అవకాశం లేకపోయింది. అయితే తన భార్య కోరికను ఎలాగైన నిరవేర్చాలని సుభాష్ భావించాడు. ఈ క్రమంలోనే ఓడ లా ఉండే ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి స్వగ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసి.. ఓడ లాంటి ఇంటి నిర్మాణం చేపట్టాడు. 2021లో ఇంటిని నిర్మించడం ప్రారంభించి.. రెండేళ్ల తరువాత ఇటీవలే పూర్తి చేశాడు. గతవారమే వీరి ఇంటి గృహ ప్రవేశ వేడుకలు జరిగాయి. భర్త ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ కు సుబశ్రీ ఆశ్చర్యంలో మునిగిపోయింది. షిప్ ఆకారంలో ఉన్న హౌస్‌ని చూసి ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

husband make house like ship for his wife

ఇంటి ద్వారంలోని మెట్లు ఓడల్లో మెట్ల మాదిరిగానే ఉన్నాయి. పైలట్ హౌస్ లేదా వీల్ హౌస్ కూడా నిర్మించబడింది. ఇక్కడ హౌస్ కెప్టెన్ సుబశ్రీ కూర్చుని బహిరంగ కార్యకలాపాలను వీక్షించవచ్చు. రాత్రి సమయంలో చూసినప్పుడు ఈ ఇంటి లైటింగ్ అచ్చం నీళ్లలో ప్రయాణించే ఓడలా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరి పేర్లు ఎస్ తో ప్రారంభంమవుతాయి.. కాబట్టి ఇంటికి S4 అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. భార్యపై అతడు చూపిన ప్రేమకు అందరు ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. మీరు.. అతడు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.