మాది చిన్న దేశమే కావొచ్చు, కానీ..! భారత్‌కు మాల్దీవ్‌ అధ్యక్షుడి వార్నింగ్‌!

Maldives President: భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన.. దేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియనిది కాదు. ఈ విషయమై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. తాజగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి.

Maldives President: భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన.. దేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియనిది కాదు. ఈ విషయమై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. తాజగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి.

నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. దేశంలో తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఈ కారణంగా చాలా మంది తమ మాల్దీవుల వెకేషన్ కు చెక్ పెట్టేశారు. సెలెబ్రిటీలు సైతం బుక్ చేసుకున్న టికెట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ వివాదాల తర్వాత మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఓ విధంగా ఇండియన్ టూరిస్టుల నుంచి మాల్దీవుల టూరిజం సెక్టార్ బాయ్‌కాట్ ఎదుర్కొంటుందని చెప్పితీరాలి. మాల్దీవుల ఆర్థిక రంగంలో మూడవ వంతు టూరిజం సెక్టార్ నుంచే వస్తుంది. దీనితో ఇప్పుడు మాల్దీవులకు పర్యాటకులు తగ్గిపోవడంతో .. ఆ దెబ్బ ఆర్థిక వ్యవస్థ మీద భారీగా పడింది. ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ ను పరోక్షంగా హెచ్చరిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మాల్దీవుల మంత్రులు.. నరేంద్ర మోడీ పర్యటనపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని.. శనివారం మాల్దీవులకు చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. మీడియాతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాల్దీవులు చిన్నదే కావచ్చు కానీ.. మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మాత్రం ఏ దేశాలకు మేము ఇవ్వలేదని అంటూ.. ఇలా చెప్పుకొచ్చారు. “హిందూ మహాసముద్రం ఒక నిర్దిష్ట దేశానికి చెందినది కాదు. ఈ మహాసముద్రంలో మనకు చిన్న ద్వీపాలు ఉన్నప్పటికీ  9,00,000 చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది.. ఈ మహాసముద్రంలో అత్యధిక వాటా కలిగిన దేశాల్లో మాల్దీవులు ఒకటి.. ఈ సముద్రం ఒక నిర్దిష్ట దేశానికి చెందింది కాదు. ఈ సముద్రం కూడా దానిలో ఉన్న అన్ని దేశాలకు చెందింది” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా మాల్దీవులు భారతదేశపు పెరట్లో ఉందన్న వ్యాఖ్యలపైన, చైనాతో సంబంధాలపై స్పందిస్తూ.. “‘మేము ఎవరి పెరట్లో లేం.. మనది స్వతంత్ర, సార్వభౌమ రాజ్యం. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మాల్దీవులు-చైనా సంబంధాలకు ఆధారం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మాల్దీవుల దేశీయ వ్యవహారాలలో చైనా ప్రభావాన్ని చూపదని కూడా పేర్కొన్నారు. ఇంకా తన చైనా పర్యటనతో తమ దేశానికి ఎక్కువ మంది టూరిస్టులను.. పంపేందుకు ప్రయత్నించాలని ముయిజ్జు విజ్ఞప్తి చేశారు. “చైనా మా (మాల్దీవుల) మార్కెట్ కోవిడ్-19 తర్వాత నంబర్ వన్.. చైనా ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు మేము ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని నా అభ్యర్థన” అని తన ఆఫీసియల్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments