iDreamPost
android-app
ios-app

గీతా చేతికి లాల్ సింగ్

  • Published Jul 06, 2022 | 4:34 PM Updated Updated Jul 06, 2022 | 4:34 PM
  • Published Jul 06, 2022 | 4:34 PMUpdated Jul 06, 2022 | 4:34 PM
గీతా చేతికి లాల్ సింగ్

మూడేళ్ళకో సినిమా చేసే అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ చైతన్య ఇందులో స్పెషల్ క్యామియో చేయడంతో అక్కినేని అభిమానుల్లో దీని మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక బజ్ వచ్చింది కానీ ఆ తర్వాత ప్రమోషన్ మీద ఫోకస్ పెట్టకపోవడంతో ఉండాల్సిన స్థాయిలో హైప్ ఇంకా లేదన్నది వాస్తవం.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో దీని రిలీజ్ కు సంబంధించిన హక్కులను గీతా సంస్థ తరఫున నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారని సమాచారం. తెలుగు హిందీ వెర్షన్లను వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలో తీసుకొస్తారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 1994లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్. మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది.

లాల్ సింగ్ చడ్డాని అరవింద్ ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి కొన్నారని ట్రేడ్ టాక్. అంత మొత్తానికి అనేది బయటికి రాలేదు కానీ సాధారణంగా అమీర్ మార్కెట్ కి మించి కొంత ఎక్కువే ఇచ్చారట. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ మూవీకి పోటీగా నితిన్ మాచర్ల నియోజకవర్గం, విశాల్ లాఠీ 12న రాబోతున్నాయి. వీటికన్నా వారం ముందు బింబిసార, సీతారామమ్ రిలీజవుతాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş