iDreamPost
iDreamPost
సరిలేరు నీకెవ్వరు వచ్చి రెండేళ్లవుతోంది. మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట కోసం ఫ్యాన్స్ మాములుగా ఎదురు చూడటం లేదు. వాస్తవానికి ముందు సంక్రాంతికి రావాలనుకుని ఆపై ఆర్ఆర్ఆర్ కోసం త్యాగం చేసి షూటింగు వాయిదా పడి మొత్తానికి ఏప్రిల్ 1ని ఫ్రెష్ డేట్ గా లాక్ చేసుకుంది. కానీ అప్పుడూ వస్తుందా రాదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఓ ఇరవై రోజులు అటుఇటు అయినా వేసవిలోపే రావడం పక్కా. ఆ మధ్య సర్జరీ కోసం చిన్న బ్రేక్ తీసుకున్న ప్రిన్స్ మళ్ళీ కొనసాగించబోతున్నారు. ఇది పూర్తవ్వగానే కొంత రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు మొదలుపెట్టాలి. హీరోయిన్ పూజా హెగ్డేతో సహా టీమ్ ఆల్రెడీ లాక్ అయిపోయింది.
అంతా బాగానే ఉంది కదా మరి అభిమానుల టెన్షన్ దేనికనా మీ సందేహం. తర్వాత చేయబోయే రాజమౌళి మూవీ గురించి. బాహుబలి నుంచి జక్కన్న ఏ సినిమా అయినా సరే కనీసం మూడేళ్లు తీసుకుంటోంది. దానికి రకరకాల కారణాలు. ఫస్ట్ కాపీ చేతిలో ఉన్నా సరే ఆర్ఆర్ఆర్ ఎదురుకుంటున్న విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాంగా. బాహుబలికి ప్రభాస్ నాలుగేళ్లు పెట్టుబడి పెడితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిసారి ఇలా రాజమౌళితో చేసే హీరోలందరికీ జరుగుతుందన్న గ్యారెంటీ లేదు కదా. ఇక్కడ ఆలోచించాల్సింది జక్కన్న తీసుకుంటున్న హీరోల టైం గురించి. అందుకే ఫాన్స్ ఆందోళన చెందటం సహజం.
మామూలుగానే మహేష్ బాబు సినిమాలు నెమ్మదిగా తెరకెక్కుతాయి. ఒక్క బిజినెస్ మెన్ మాత్రమే పూరి జగన్నాధ్ ఫాస్ట్ గా తీయగలిగాడు. కానీ రాజమౌళి కనక మహేష్ టైంని ఇలా మూడు నాలుగేళ్లు తీసుకుంటే చాలా కష్టమనేది జనాల అభిప్రాయం. ఇప్పుడు ప్రిన్స్ వయసు 46. ఏడాదికి ఒక సినిమా మాత్రమే వస్తోంది. మధ్యలో ఈ కరోనా లాంటి మహమ్మారుల వల్ల ఒక్కోసారి ఈ గ్యాప్ ఇంకా పెరుగుతోంది. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ లాగా ఏళ్ళ తరబడి లాగేసుకుంటే కౌంట్ పెరగదు. మరి జక్కన్న ఈసారి జాగ్రత్తపడి త్వరగా ఫినిష్ అయ్యేలా ఏమైనా ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.ఇలా కోరుకోవడం కూడా అత్యాశేమో.
Also Read : 83 Movie : ఇలాంటి బయోపిక్కులు ఆపేస్తే మంచిదేమో