iDreamPost
android-app
ios-app

సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ ఫోన్ చేసి ఏం చెప్పారో రివీల్ చేసిన పరశురామ్..

  • Published May 16, 2022 | 7:22 PM Updated Updated May 16, 2022 | 7:22 PM
  • Published May 16, 2022 | 7:22 PMUpdated May 16, 2022 | 7:22 PM
సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ ఫోన్ చేసి ఏం చెప్పారో రివీల్ చేసిన పరశురామ్..

మహేష్ బాబుని చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ క్యారెక్టర్ లో చూపించారు సర్కారు వారి పాట సినిమాలో. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఒక రీజనల్ సినిమాకి 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల సునామి కురిపిస్తుంది. ఇవాళ మే 16న కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. పరశురామ్ మాట్లాడుతూ.. మ‌హేశ్ గారు సినిమా రిలీజ్ అయిన రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు నాకు ఫోన్ చేశారు. అందరూ ఆయనకి సినిమా బాగుందని చెప్తున్నారని చెప్పారు. ఇలాంటి హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని నాతో షేర్ చేసుకున్నారు. ఊహించ‌ని విధంగా నాకు కూడా ఆయన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న చెప్పిన శుభాకాంక్ష‌లు నాకు చాలా స్పెషల్. అదే రోజు రాత్రి మేమంతా సక్సెస్ పార్టీలో క‌లిశాం. మ‌హేశ్ బాబు అక్కడ కూడా సినిమా సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడారు అని తెలిపారు. ఈ సినిమా స‌క్సెస్‌తో రెండేళ్లుగా ప‌డ్డ కష్టానికి ప్ర‌తిఫ‌లం దక్కిందని ఆయన అన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet