iDreamPost
android-app
ios-app

మహేష్ 27 హీరోయిన్ ఫిక్స్ ?

  • Published Feb 02, 2020 | 5:13 AM Updated Updated Feb 02, 2020 | 5:13 AM
  • Published Feb 02, 2020 | 5:13 AMUpdated Feb 02, 2020 | 5:13 AM
మహేష్ 27 హీరోయిన్ ఫిక్స్ ?

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలితో గడుపుతున్నాడు. ఎప్పుడు తిరిగివస్తాడనే క్లారిటీ లేదు కానీ కొంచెం టైం పట్టేలా ఉంది. ఇదలా ఉంచితే మహేష్ నెక్స్ట్ మూవీ ఏది చేస్తాడనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు కాబట్టి ఇది లాంఛనంగా ప్రారంభం కావడమే మిగిలింది. స్క్రిప్ట్ పనులతో పాటు టీమ్ ని సెట్ చేసుకునే పనులు బ్యాక్ గ్రౌండ్ లో సాగుతున్నాయట.

విశ్వసనీయ సమాచారం మేరకు హీరోయిన్ గా కియారా అద్వానీని ఫిక్స్ చేసినట్టుగా ఫిలిం నగర్ టాక్ . గత కొంత కాలంగా బాలీవుడ్ ఆఫర్స్ తో చాలా బిజీగా ఉన్న కీయరా వినయ విదేయ రామ తర్వాత మళ్ళి ఇక్కడ కనిపించలేదు మహేష్ తో కీయరాకు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఉంది. డెబ్యు మూవీ భరత్ అనే నేనుతోనే బంపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరో సారి రిపీట్ అంటే విశేషమే. అందులో ఈ జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

క్యుట్ లుక్స్ తో ఆకట్టుకునేలా ఉండే కీయరాకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. రామ్ చరణ్ సినిమా డిజాస్టర్ అయినా అందులో కూడా తన అందంతో మురిపించిన కీయరా అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ లోనూ మనవాళ్ళను పడగొట్టేసింది.ఇప్పుడు మరోసారి ప్రిన్స్ పక్కన జోడిగా అంటే అంత కంటే స్వీట్ న్యూస్ అభిమానులకు ఏముంటుంది. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom