iDreamPost
iDreamPost
రెండు రోజుల క్రితం శివసేనలో తిరుగుబాటు సంక్షోభం తర్వాత ఫేస్ బుక్ లైవ్ లో జనం ముందుకొచ్చారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. శివసేన ఎప్పుడూ “హిందుత్వాన్ని ఎప్పటికీ వదులుకోదు” అని చెప్పారు. అదే సమయంలో సీఎం పదవికి రిజైన్ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను రెడీ ఉంచాను, ఈ క్షణంలోనే రాజీనామాకు సిద్ధం.
అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే నన్ను ముఖ్యమంత్రిగా వద్దు అని చెబితే, పదవికి రాజీనామా చేసి, సిఎం అధికారిక నివాసం నుంచి వెళ్లిపోతాను.
నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలని శరద్ పవార్, కమల్‌నాథ్‌లు నాకు ఫోన్ చేశారు
ఎక్ నాథ్ షిండేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుండి కాల్స్ వచ్చాయి, తమను బలవంతంగా తీసుకెళ్లారని బాధపడుతున్నారు.
హిందుత్వం నుంచి శివసేనను విడదీయలేం.