iDreamPost
android-app
ios-app

నేడే మహా కేబినెట్ విస్తరణ?? – అజిత్ పవార్ కి కలసివచ్చిన అదృష్టం!!

నేడే మహా కేబినెట్ విస్తరణ?? – అజిత్ పవార్ కి కలసివచ్చిన అదృష్టం!!

ఉద్భవ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు కావొస్తున్నా ఇంతవరకు పూర్థిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం తో సుదీర్ఘ ఉత్కంఠతకు తెరదించుతూ ఈరోజు మధ్యహ్నం 1 కి మహారాష్ట్ర విధాన సభలో క్యాబినెట్ విస్తరణకి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సమయంలో ఆయన తో పాటు మూడు పార్టీల నుండి ఇద్దరిద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.

బిజెపి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేసి తిరిగి సొంత పార్టీలో చేరిన శరద్ పవార్ తమ్ముడి కొడుకు యన్సిపి శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ తిరిగి మరోసారి కొత్త ప్రభుత్వంలో కుడా ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు మరో కీలకమైన హోం శాఖ చేపట్టే అవకాశం వుంది. అయితే పార్టీలో మరో కీలక నేత జయంత్ పాటిల్ కూడ ఈ పదవికొసం పోటిలో ఉన్నట్టు పార్టి వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికీ ఏ మంత్రిత్వ శాఖలు చెపటనున్నారొనన్న దానిపై ఆసక్తి నెలకొని వుంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తో పాటు యన్సిపి ముఖ్య నేత నవాబ్ మాలిక్ లకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ నుండి 12 మండికి, యన్సిపి నుండి ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు 16 మంత్రి పదవులు, శివ సేన 15 మంత్రి పదవులు పంచుకోవాలని ఈ మూడు పార్టీల కూటమి “మహా వికాస్ అఘాడి” ఒక అవగాహనకి వచ్చింది.

యన్సిపి నుండి నవాబ్ మాలిక్, జితేందర్ అవద్, దిలీప్ వాస్లే పాటిల్, హసన్ ముష్రీఫ్, బాబా సాహెబ్ పాటిల్, రాజేందర్ షింగ్నే,ధనుంజయ్ ముండే మరియు అనిల్ దేశ్ ముఖ్ కి క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది

కాంగ్రెస్ నుండి అశోక్ రావ్ చౌహాన్, యశొమతి థాకూర్, కెసి పడావి, విజయ్ వద్దెటి వార్, అమిత్ దేశ్ ముఖ్, వర్షా గైక్వాడ్, సునీల్ కేదార్, అస్లాం షేక్ లకు తుది జాబితా లో చోటు దక్కే అవకాశం ఉంది.

కాంగ్రెస్ మంత్రుల జాబిత కి నిన్ననే ఆ పార్టి నేత బాలాసాహెబ్ థొరాట్ డిల్లీ లో అధిశ్టానం దగ్గర అనుమతి తీసుకొని వచ్చారు.

వీరితో పాటు ఒక స్వతంత్ర శాసన సభ్యులు ఓం ప్రకాష్ బాబారావ్ కి కుడా తుది బెర్త్ లో చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం పూర్తి స్థాయి కేబినెట్ లో 42 మంది వరకు చోటు కల్పించ వచ్చు. గవర్నర్ భగత్ సింగ్ కొషియారి మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు