Arjun Suravaram
Arjun Suravaram
ఇటీవల తరచూ కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైద్యరంగంలో అనేక వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వారం క్రితం ఓ వ్యక్తి మెదడులో పాము లాంటి జీవిని వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి.. ఆ జీవిని బయటకు తీశారు. అలానే ఓ వ్యక్తి కడుపులో గ్లాస్ ను గుర్తించిన వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేజీల కొద్ది వెంట్రుకలను సైతం మనిషి శరీరంలో వైద్యులు గుర్తించిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఏడేళ్ల బాలుడి గడుపులు ఆయస్కాంతాలను ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సకాలంలో శస్త్ర చికిత్స నిర్వహించి బాలుడి ప్రాణాలు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణానికి చెందిన ఓ దంపతులకు ఆర్య అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు ఆడుకోడానికి తల్లిదండ్రులు కొన్ని వస్తువులు కొనిచ్చారు. వాటితో ఆడుతూ.. ఆడుతూ.. ఆయా వస్తువుల్లోని చిన్నపాటి అయస్కాంత గుండ్లను ఆ బాలుడు మింగేశాడు. అలా ఆ వస్తువుల్లో దాదాపు 50 వరకు చిన్నపాటి అయస్కాంతాలను మింగేశాడు. అవి పేగుల్లో చిక్కుకుపోవడంతో కొన్ని రోజుల తరువాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అంతేకాక వాంతులతో ఆ బాలుడు అల్లాడిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు ఇటీవల విజయవాడ రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వైద్యులు స్కానింగ్ చేసి.. బాలుడి కడపులో అయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి వైద్యులు వాటిని తొలగించారు. సరైన సమయంలో బాలుడిని ఆస్పత్రికి తీసుకురావడం వల్ల కాపాడగలిగామని మంగళవారం ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ అన్నారు. తమ బిడ్డను కాపాడినందుకు వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పేగుల్లో పేరుకుపోయిన అయస్కాంతాలను తొలగించి చిన్నారిని బతికించిన వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.