iDreamPost
android-app
ios-app

Magadheerudu : ఎమోషన్ ఎక్కువైన మెగాస్టార్ మూవీ

  • Published Feb 15, 2022 | 2:00 PM Updated Updated Dec 06, 2023 | 1:11 PM

అదే సమయంలో కన్నడలో హిట్టయిన 'తాయియనుడి' చూసి దాన్ని చిరు ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులతో తీయాలని నిర్ణయించుకున్నారు. లైన్ చెప్పగానే చిరంజీవి ఆలోచించలేదు. ఆయన మీద నమ్మకం అలాంటిది. జయసుధను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

అదే సమయంలో కన్నడలో హిట్టయిన 'తాయియనుడి' చూసి దాన్ని చిరు ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులతో తీయాలని నిర్ణయించుకున్నారు. లైన్ చెప్పగానే చిరంజీవి ఆలోచించలేదు. ఆయన మీద నమ్మకం అలాంటిది. జయసుధను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

Magadheerudu : ఎమోషన్ ఎక్కువైన మెగాస్టార్ మూవీ

1985. చిరంజీవితో రెండు సినిమాలు తీసి తమ కాంబినేషన్ కి సక్సెస్ ఫుల్ స్టాంప్ వేయించుకున్న దర్శకుడు విజయబాపినీడు మరో చిత్రానికి ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరికీ ‘మగమహారాజు’ ఫ్యామిలీ ఆడియన్స్ తో మంచి పేరు తీసుకొచ్చింది. కమర్షియల్ గానూ అది సాధించిన విజయం అప్పట్లో ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. అందుకే ఈసారి కూడా ఎమోషనల్ సబ్జెక్టునే తీసుకోవాలనేది బాపినీడు ఆలోచన. దీనికి ముందు చేసిన ‘మహానగరంలో మాయగాడు’ ఫ్లాప్ అయ్యింది. అందుకే రిస్క్ తీసుకోకూడదనుకున్నారు. అందుకే ఎమోషనల్ డ్రామాకే ఓటేశారు. అదే సమయంలో కన్నడలో హిట్టయిన ‘తాయియనుడి’ చూసి దాన్ని చిరు ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులతో తీయాలని నిర్ణయించుకున్నారు. లైన్ చెప్పగానే చిరంజీవి ఆలోచించలేదు. ఆయన మీద నమ్మకం అలాంటిది.

జయసుధను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అప్పటికే చిరు ఆవిడ కలిసి నటించినప్పటికీ అవి చేసిన సమయానికి మగధీరుడు టైంకి ఇమేజ్ పరంగా చాలా మార్పులు వచ్చాయి. అందుకే అనౌన్స్ చేసినప్పుడే అభిమానులకు ఏదో సంశయం. కాశి విశ్వనాథ్ సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధమయ్యింది. ఎస్పి బాలసుబ్రమణ్యం సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. మెగాస్టార్ మూవీకి ఆయన మ్యూజిక్ ఇచ్చిన మూవీ ఇదొక్కటే. ముఖ్యంగా ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం పెద్ద హిట్ సాంగ్. లోక్ సింగ్ ఛాయాగ్రహణం అందించారు. రావు గోపాల్ రావు, చంద్రమోహన్, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రోజారమణి ఇతర తారాగణం.

కుటుంబమంతా కలకాలం కలిసి ఉండాలనే ఓ ఇంటి పెద్ద ఆకాంక్షకు విరుద్ధంగా ఓ కోడలి వల్ల ముగ్గురు కొడుకులు విడిపోయే పరిస్థితి వస్తుంది. చిన్నవాడు రవిరాజా(చిరంజీవి)భార్యకు దూరమై జైలుకు వెళ్తాడు. తిరిగి వీళ్లంతా ఎలా కలుసుకున్నారనేదే కథ. 1986 మార్చి 7 విడుదలైన మగధీరుడులో సెంటిమెంట్ డోస్ బాగా ఎక్కువ కావడంతో అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకోలేదు. అయినా కూడా వంద రోజులు ఆడిన కేంద్రాలు రావడం చిరంజీవి ఇమేజ్ ని సూచిస్తుంది. కేవలం వారం గ్యాప్ లో వచ్చిన స్వాతిముత్యం, ప్రతిధ్వని అదే నెల మూడో వారంలో విడుదలైన కృష్ణ ‘సింహాసనం’ మగధీరుడు రన్ మీద చాలా ప్రభావం చూపించాయి

Also Read : Ramachari : కనకవర్షం కురిపించిన కన్నడ చంటి – Nostalgia