iDreamPost
iDreamPost
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ని పీక్స్ లో ఎంజాయ్ చేశాక ప్రస్తుతం సీనియర్ హీరోలతో సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీ అయ్యింది. ఈ క్రమంలో వచ్చిందే బబ్లీ బౌన్సర్. డిస్నీ హాట్ స్టార్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. విలక్షణ చిత్రాలతో ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీస్తారని ఎంతో గొప్ప పేరున్న మధుర్ భండార్కర్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ట్రైలర్ లో తమన్నా ఎన్నడూ లేనంత చలాకీగా కనిపించడం, ఎవరూ టచ్ చేయని లేడీ బౌన్సర్ టాపిక్ ని తీసుకోవడంతో ఆసక్తి పెరిగింది. ప్రత్యేకంగా బలమైన క్యాస్టింగ్ లేకపోయినా కేవలం తమన్నా బ్రాండ్ ఇమేజ్ మీదే మార్కెటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
ఢిల్లీకి దగ్గరలో ఉండే గ్రామం ఫతేపూర్ బేరి. అక్కడ నివసించే యువకుల్లో బాగా దేహ ధారుడ్యం పెంచుకుని దేశ రాజధానిలో బౌన్సర్లుగా ఉద్యోగం తెచ్చుకోవడమే పెద్ద లక్ష్యంగా ఉంటుంది. అయితే బబ్లీ(తమన్నా)కు తామెందుకు ఆ పని చేయకూడదనేదనేది అభిమతం. తండ్రి ప్రోత్సాహం ఉన్నా తల్లి వద్దని వారిస్తూ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది. ఈ క్రమంలో అదే ఊళ్ళో స్కూల్ టీచర్ గా ఉన్న విరాజ్ (అభిషేక్ బజాజ్)ని చూసి బబ్లీ మనసు పారేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తను కోరుకున్నట్టే ఢిల్లీ వెళ్లి అక్కడో నైట్ పబ్ లో బౌన్సర్ గా చేరుతుంది. ఆ తర్వాత ఎదురయ్యే సంఘటనలు, విలేజ్ నుంచి సిటీకి వెళ్లిన కండల రాణికి ఎదురైన అనుభవాలే అసలు స్టోరీ
తీసుకున్న లైన్ లో కొంత నవ్యత ఉన్నప్పటికీ అంత అనుభవమున్న మధుర్ భండార్కర్ దాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఊళ్ళో అందరూ ఎందుకు బౌన్సర్లు కావాలనుకుంటున్నారనే బేసిక్ లాజిక్ నుంచి బబ్లీ విరాజ్ ల ప్రేమకథ దాకా ఏదీ కన్విన్సింగ్ గా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా సాగుతూ ఫార్వార్డ్ బటన్ కు పని చెబితే రెండో సగం జస్ట్ కొంచెం బెటరనే ఫీలింగ్ కలిగిస్తుంది. తండ్రి కూతుళ్ళ ఎమోషన్ కొంత పండింది కానీ సినిమాను నిలబెట్టేందుకు అది సరిపోలేదు. తమన్నా పెర్ఫార్మన్స్ ఎంత బెస్ట్ అనిపించినా సాంకేతిక విభాగాల పనితనం అంతంత మాత్రంగా ఉండటంతో ఈ బౌన్సర్ యావరేజ్ అనిపించుకోవడానికే చాలా కష్టపడింది. వీలైనంత వరకు అంచనాలు జీరో పెట్టుకుంటే తప్ప ఈ బబ్లీ ఏ కోశానా లవ్లీ అనిపించదు