iDreamPost
android-app
ios-app

అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవన్ – ట్వీట్ డిలీట్ చేసిన అభిమాని

అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవన్ – ట్వీట్ డిలీట్ చేసిన అభిమాని

పైరసీ విషయంలో సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పైరసీ వల్ల ఎంతో నష్టాన్ని చూస్తున్నారు నిర్మాతలు. తాజాగా హీరో మాధవన్ నటించిన సినిమాపై ఒక ప్రేక్షకుడి అత్యుత్సాహంతో మరోసారి పైరసీ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మాధవన్ తన స్వీయ దర్శకత్వంలో “రాకెట్రీ.. ది నంబీ ఎఫెక్ట్” అనే సినిమాను తెరకెక్కించారు. ఇది ఇస్రో శాస్త్రవేత్త నం బి నారాయణన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా నిర్మించిన చిత్రం. ఇటీవల జులై 1న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

కానీ, ఈ సినిమాను చూసిన ఒక ప్రేక్షకుడు మాత్రం.. ఈ సినిమా చాలా బాగుందని, తొలిసారిగా దర్శకత్వం వహించనప్పటికీ చాలా అద్భుతంగా సినిమాను తీశాడని మెచ్చకున్నాడు. ప్రత్యేకించి క్లైమాక్స్ సీన్లను తాను మళ్ళీ మళ్ళీ చూసినట్లుగా మాధవన్ కు ట్వీట్ చేశాడు.

అభిమాని ట్వీట్ ను కౌంటర్ గా స్పందించిన మాధవన్, ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ ఎలా చూడగలిగావు? అని ప్రశ్నించారు. అలా చూడటం కేవలం పైరసీ ద్వారానే సాధ్యమని చెప్పడంతో సదరు అభిమాని తన ట్వీట్ ను డిలీట్ చేశాడు. అప్పటికే అతడి ట్వీట్ వైరల్ కావడంతో, అందరూ ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet