iDreamPost
android-app
ios-app

Macherla Niyojakavargam Trailer: మాస్ బ్లాస్ట్, మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూశారా?

Macherla Niyojakavargam Trailer: మాస్ బ్లాస్ట్, మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూశారా?

హీరో ఎలివేష‌న్లు, రొమాంటిక్ కామెడీ. రెండు మాటల్లో, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా థియేట్రికల్ ట్రైలర్. కమర్షియల్‌ సినిమా అనుకున్న అంశాలన్నీ ఉన్నాయి. కామెడీ, చమత్కారం, డైలాగ్‌లు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ వంటి తెలిసిన ముఖాలు కామెడీ సంగతి చూస్తే, విలన్ రాజప్పగా సముద్రఖని భయపెట్టాడు. ట్రైల‌ర్ లోనే సిన‌మా క‌థ తెలిసిపోయింది. ఈ ట్రైల‌ర్ ని గుంటూరులో అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.

మాచర్లకి జిల్లా కలెక్టర్ ఎన్ సిద్ధార్థ్ రెడ్డిగా హీరో రావ‌డంతోనే, యాక్ష‌న్ మీట‌ర్ పెరిగింది. రాజప్పతో ముఖాముఖిగా త‌ల‌ప‌డే సీన్స్ తో మాస్ బ్లాస్ట్. మాస్ మసాలా సాంగ్స్, ఫైట్లు, పంచ్ డైలాగ్‌లు…అన్నింటికి మించి నితిన్ మాస్ యాటిట్యూడ్‌తో, ట్రైల‌ర్ మంచి రంజుగా ఉంది. ట్రైల‌ర్ ఫ‌స్ట్ పార్ట్ లో, రొమాంటిక్ గా, కామెడీని పండించిన‌నితిన్ ఒక్క‌సారి మాచ‌ర్ల‌కు వ‌చ్చాక‌, యాక్ష‌న్ మేన్ గా మారిపోయాడు.

యంగ్ హీరో నితిన్ మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్సే.

ఎడిటర్‌గా మంచిపేరున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఆయ‌న ప‌నిత‌న‌మంతా ట్రైలర్ ను క‌ట్ చేసిన తీరులోనే ఉంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం యాక్ష‌న్ సీన్స్ లో అద‌ర‌గొడితే, పెట్ట‌న ఖ‌ర్చు గొప్ప‌గా స్క్రీన్ మీద క‌నిపించింది

హతి స్వర సాగర్ BGM తో ట్రైల‌ర్ ని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లారు. శ్రేష్ట్ మూవీస్ కాబ‌ట్టి, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpuan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş