iDreamPost
iDreamPost
తెలుగులో పెద్దగా అంచనాలు లేకపోయినా శింబు కొత్త సినిమా మానాడు(తెలుగు టైటిల్ ది లూప్) ఆఖరి నిమిషం దాకా వాయిదాల టెన్షన్ లో పడి ఎట్టకేలకు తమిళనాడులో ఉదయం షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం షోలన్నీ రద్దు చేసి పోస్ట్ పోన్ చేశారు. రేపైనా ఉంటుందా లేక ఆలస్యంగా వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆర్థికపరమైన చిక్కుల వల్ల మానాడుకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. నిన్న మీడియాతో మాట్లాడుతున్న శింబు ఏకంగా మైకు ముందే కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. నాకు తోడు ఉండండి, నన్ను అడ్డుకుంటున్న వాళ్ళను నేను చూసుకుంటానని పిలుపు ఇచ్చాడు.
ఇప్పుడు ప్రీమియర్ల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం మానాడు పాజిటివ్ టాక్ తో వెళ్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభు టైం లూప్ కాన్సెప్ట్ ని తీసుకుని చాలా డిఫరెంట్ గా దీన్ని ప్రెజెంట్ చేశారని షోలు చూసిన నెటిజెన్లు ట్వీట్లు పెడుతున్నారు. అజిత్ తో తీసిన గ్యాంబ్లర్ ద్వారా వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత కూడా సినిమాలు వచ్చినప్పటికీ దాని స్థాయికి అవి చేరుకోలేదు. ఇప్పుడీ మానాడు మీద మంచి అంచనాలు ఉన్న తరుణంలో ఇలా జరగడం ఇక్కడి మూవీ లవర్స్ కి నిరాశ కలిగించేదే. ఇవాళ తెలుగు స్ట్రెయిట్ రిలీజులు ఏవి లేవు కాబట్టి ది లూప్ వచ్చి ఉంటే ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అయ్యేది
ముందు నుంచి వివాదాలతో నలుగుతూనే ఉన్న శింబు నిజానికి ఈ మానాడు నిర్మాతతో కూడా మొదట్లో గొడవలు తెచ్చుకున్నారు. విసుగు చెందిన ఆయన ఇదే సబ్జెక్టుని వేరే హీరోతో తీస్తారని గతంలో ప్రకటించారు. దానికి శింబు నాన్న టి రాజేందర్ తో కలిసి మహామానాడు అనే మరో ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. తర్వాత మధ్యవర్తులు రాజీ కుదర్చడంతో రెండూ జరగలేదు. గత కొన్నేళ్లుగా హిట్టు మొహం చూడని శింబుకి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. ఎన్నడూ లేనిది అదే పనిగా హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసుకున్నాడు. తీరా చూస్తే ఇలా జరిగింది. ఆన్ లైన్లో లూప్ బుకింగ్స్ తీసేశారు. చూడాలి మరి రేపైనా ఉంటుందో లేదో
Also Read : Samantha : సూపర్ స్టార్ మూవీలో సమంతా ?