iDreamPost
android-app
ios-app

మోహన్ బాబుకు మెగాబ్రదర్ ప్రశ్నలు

  • Published Sep 09, 2021 | 9:01 AM Updated Updated Sep 09, 2021 | 9:01 AM
మోహన్ బాబుకు మెగాబ్రదర్ ప్రశ్నలు

మొన్న బండ్ల గణేష్ తాను ముందున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటికి వచ్చిన ఉదంతాన్ని మర్చిపోకముందే ఇప్పుడింకో కొత్త ఇష్యూ బయటికి వచ్చింది. మా బిల్డింగ్ గురించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు వివరణ ప్లస్ నిరసనగా మెగా బ్రదర్ నాగబాబు ఒక వీడియోని విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం అడగాల్సిన ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తడం గురించి చురకలు వేస్తూనే ఆ బిల్డింగ్ కొన్నది మేమున్న హయాంలోనే అయినా అమ్మింది మాత్రం నరేష్ ఉన్నప్పుడని అది కూడా కేవలం 30 లక్షల అతి తక్కువ ధరకు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో అడగాలని గట్టి కామెంట్లే చేశారు నాగబాబు.

Also Read: సినిమా ఎలక్షన్ల వెనుక రాజకీయ ఎత్తులు

దీన్ని బట్టి మా కోసం శ్రీనగర్ కాలనీలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా 71 లక్షలతో కొన్న స్థలాన్ని తర్వాత అందులో సగం రేట్ కే అమ్మేశారని నాగబాబు మాటల సారాంశం. నిర్వహణ భారంగా మారిందనే కారణంతో నరేష్ టీమ్ అమ్మేశారని అయితే అంత భరించలేని ఖర్చులు ఏమొచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అప్పుడు వచ్చిన డబ్బు తర్వాత ఏమైందో కూడా తెలియదని మరో ప్రశ్న లేవనెత్తడం కొత్త మలుపు. మా అసోసియేషన్ పెట్టుకున్న జూమ్ మీటింగ్ తాలూకు వీడియో బయటికి ఎలా వచ్చిందో కూడా విచారణ చేయాలన్న నాగబాబు మొత్తానికి వాతావరణాన్ని మరింత వేడెక్కించేశారు.

తనవైపు వెర్షన్ ని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు నరేష్ వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు నేరుగా మద్దతు ఇస్తున్నానని పదే పదే నొక్కి చెబుతున్న నాగబాబు ఇప్పుడు ఇలా మా బిల్డింగ్ విషయంలో ఈ సంగతులు బయట పెట్టి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇంకా ఎన్నికలకు టైం ఉన్నప్పటికీ ఈ పరిణామాల తాలూకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు టాలీవుడ్ అంతర్గత వ్యవహారమైన ఎన్నికలు ఇలా రచ్చకెక్కి మీడియా దాకా వెళ్లడం గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకేమేం జరగబోతున్నాయో

Also Read: మా ఎన్నికలలో ఇంకెన్ని ట్విస్టులో