iDreamPost
android-app
ios-app

బైక్ రైడింగ్ చేస్తూ లవర్స్ డేంజరస్ రొమాన్స్!

బైక్ రైడింగ్ చేస్తూ లవర్స్ డేంజరస్ రొమాన్స్!

ఈ మధ్యకాలంలో కొందరు యువత  శృతిమించి ప్రవర్తిస్తున్నారు. తాము ఏమి చేసిన అడిగేవారు లేరని ఇష్టాను రీతిగా ప్రవర్తిస్తున్నారు. మరీ.. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. వారి చేష్టాలు చూసిన పబ్లిక్.. ఏందయ్యా ఈ అరాచకం అని అంటున్నారు. ఇప్పటి వరకు రొమాన్స్ అంటే పడక గది వరకే ఉండేది. కొందరు బస్సుల్లో, థియేటర్లో, మెట్రోల్లో రొమాన్స్ చేసిన వీడియోలు మనం అనేకం చూశాం. ఇటీవలే ఇద్దరు ప్రేమికులు ఢిల్లీ మెట్రో రైల్లో లిప్ లాక్ సీన్ చూపించారు. ఇలా ఒకటికాదు అనేకం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరికొందరు యువత శృతి మించి బైక్ రైడింగ్ చేస్తూనే రొమాన్స్ చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని ఇందిరాపురం సమీపంలో 9వ నెంబర్ జాతీయ రహదారిపై ఇద్దరు ప్రేమికులు  బైక్ పై వెళ్తున్నారు. అది మాములుగా కాదండి బాబు.. బైక్ నే రొమాన్స్ రూమ్ గా మార్చుకున్నారు. ఆ యువకుడు డ్రైవ్ చేస్తుంటే.. ఆ యువతి ముందు కూర్చుని గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరు లిప్ లాక్ తో శృతి మించి పోయారు. అలానే ఇద్దరు రొమాన్స్ చేస్తూ చాలా దూరం డ్రైవ్ చేశారు. వీరి ఓవర్ యాక్షన్ ను అటుగా వెళ్తున్న తోటి ప్రయాణికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  పెళ్లి కాకుండా ఇలాంటివి చేయడమే తప్పు అయితే పబ్లిక్ గా చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి పిల్లలను కన్న తల్లిదండ్రులు దురదృష్టవంతులంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఓ సోషల్ యూజర్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.  ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే..మరోసారి పునరావృతం కావని పోస్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో  రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి. వారిపై పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. అలానే వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet