iDreamPost
android-app
ios-app

వీడియో: నేషనల్‌ హైవేపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట!

  • Published Jul 18, 2023 | 10:46 AM Updated Updated Jul 18, 2023 | 10:46 AM
  • Published Jul 18, 2023 | 10:46 AMUpdated Jul 18, 2023 | 10:46 AM
వీడియో: నేషనల్‌ హైవేపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట!

ప్రేమలో పడ్డప్పుడు ప్రేమికులు క్రేజీ పనులు చేస్తారన్నది అందరికీ తెలిసిన సంగతే. ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్‌ చేయడానికో.. లేదా వారితో సంతోషంగా గడపటానికో కొంతమంది వింతవింత పనులు చేయటం సర్వసాధారణం. అయితే,  ఈ మధ్య కాలంలో ప్రేమికులు చాలా దారుణంగా తయారవుతున్నారు. తాము ప్రేమికులం అని చాటి చెప్పటానికో.. ఓవర్‌ నైట్‌లో ఫేమస్‌ అయిపోవాలనో తెలీదు కానీ, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. బైకుపై విచిత్రమైన స్టంట్లు చేస్తూ కేసుల్లో చిక్కుకుంటున్న ప్రేమికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట నేషనల్‌ హైవేపై హల్‌చల్‌ చేసింది. బైకుపై ఎదురెదురుగా కూర్చుని సినిమా స్టైల్లో రెచ్చిపోయింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలో చోటుచేసుకుంది. మంగోల్‌ పురి సమీపంలోని రోడ్డుపై వెళుతున్న ఓ ప్రేమ జంట ఈ పని చేసింది. ఆ రోడ్డుపై చాలా వాహనాలు స్పీడుగా వెళుతున్నాయన్న భయం కూడా లేకుండా స్పీడుగా బైకు నడిపాడు అబ్బాయి. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. తర్వాత దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు.

ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి’’.. ‘‘ అబ్బాయిని పోలీసులు శిక్షిస్తారు. అమ్మాయిని మాత్రం ఏమీ అనకుండా వదిలేస్తారు’’.. ‘‘ ఇలా రోడ్లపై సర్కస్‌ ఫీట్లు చేసే వారిని కచ్చితంగా శిక్షించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఈ వీడియోపై స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశామని, త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet