ఒక పాత ఫోటో చూస్తేనో.. ఒక పాత పాట వింటేనో.. లేదా అప్పటి వ్యక్తుల్ని కలిస్తేనో కొన్ని జ్ఞాపకాలు మనసులో మెదులుతాయి.. మనల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుపోతాయి. పాషాణ హృదయాలు లేని ప్రతి ఒక్కరికీ ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయి. కొన్నిసార్లు ఒక తరం మొత్తానికి కామన్ గా ఉండే జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఒక బ్లాక్ బస్టర్ సినిమా.. ఒక స్టార్ హీరో.. ఒక హీరోయిన్ ఇలాంటి అంశాలే. సరిగ్గా అలాంటిదే ‘మైనే ప్యార్ కియా’ సినిమా. అందులోఇన్నోసెంట్ ఫేసుతో ‘కబూతర్ జా జా’ అని అదేపనిగా పాడి పాడి పావురాన్ని కండలవీరుడు సల్మాన్ దగ్గరికి పంపి మరీ అప్పటి ప్రేక్షకుల హృదయాలలో ఉండే తీగలను గట్టిగట్టిగా లాగేసిన హీరోయిన్ భాగ్యశ్రీ. ఆ భాగ్యశ్రీని అప్పటి ప్రేక్షకులు ఇప్పుడు కలిస్తే ఏమౌతుంది?
ఏమౌతుంది? సింపుల్ గా చెప్పాలంటే.. జ్ఞాపకాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి.. జోష్ రవి ఫేస్ బుక్ పోస్ట్ లా మారతాయి. యాక్టర్ జోష్ రవి తెలుసు కదా. మీలో ఎవరు కోటీశ్వరుడు లో మెగాస్టార్ ను అనుకరించి చాలామందిని మెప్పించాడు. ఈమధ్యే మన జోష్ రవి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో తన చిన్ననాటి అభిమాన హీరోయిన్ ‘ప్రేమ పావురాలు’ భాగ్యశ్రీని కలిశాడు. అంతే.. సాధారణ అభిమానిలా ఆమెతో ఒక ఫోటో దిగి ఆ ఫోటోను తన ఎఫ్బీ లో పోస్ట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టాడు.
ఆ సందేశం ఇదే
“నా చిన్ననాటి #పావురాయి
#మైనేప్యార్కియా.. మేరా #కభూతర్ #భాగ్యశ్రీ
అప్పట్లో నా ఊరు #SRA #థియేటర్ దగ్గర నన్ను నిర్దాక్షిణ్యంగా
నడిరోడ్డు కడ్డంగా ఆపేసిన, నిలిపేసిన
నా #దిల్దివానా.. వన్ ఆఫ్ మై #ప్రేమపావురాయి మొన్ననే
పార్క్ హయత్ లోనా పక్కనే వాలింది.. మనమాగుతామా పక్కకెళ్లి ఓపెన్ ఐపోయాం, ఎన్నో నొస్టాలజిక్ ఫీలింగ్స్, నా పిచ్చి మొత్తం చెప్పా, ఆవిడ తన ఇష్టాన్ని కురిపించారు.. అబ్భా
ఏం నవ్వురా నాయనా, పక్కకి వచ్చి అనుకున్నా.. మేడమ్ సార్ మేడమ్ అంతే…”
ఇలా జోష్ రవి తన మనసులోని భావాలను అక్షరరూపంలోకి మార్చిన తర్వాత దానికి కొనసాగింపుగా మాటలు చెప్పడం నిజంగా అనవసరం.
ఈ పోస్ట్ అప్పటి జెనరేషన్ ప్రేక్షకులు ఎవరైనా చదివితే వారికి కూడా ఇలాంటి అనుభూతే కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.