iDreamPost
android-app
ios-app

250 కి.మీ అవతల తప్పిపోయిన కుక్క! 24 గంటలు గడవకముందే!

ఇంట్లో పిల్లలు మాట వినకపోతే నిన్ను పెంచడం కన్నా ఆ కుక్కను పెంచితే నయం. కాస్త విశ్వాసమైన చూపిస్తుంది అంటుంటారు పేరెంట్స్. సరదాగా అన్న కుక్క విశ్వాసమైన జంతువే. అందుకే కుక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.

ఇంట్లో పిల్లలు మాట వినకపోతే నిన్ను పెంచడం కన్నా ఆ కుక్కను పెంచితే నయం. కాస్త విశ్వాసమైన చూపిస్తుంది అంటుంటారు పేరెంట్స్. సరదాగా అన్న కుక్క విశ్వాసమైన జంతువే. అందుకే కుక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.

250 కి.మీ అవతల తప్పిపోయిన కుక్క! 24 గంటలు గడవకముందే!

ఇంట్లో పిల్లలు మాట వినకపోతే పేరెంట్స్ నిన్ను పెంచడం కన్నా గేదెనే, మేకనో లేదా ఓ కుక్కను పెంచుకోవడం నయం అంటుంటారు. ఓ ముద్ద పడేస్తే కుక్క విశ్వాసంగా ఉంటుందని, చెప్పిన మాట వింటుందని తిడుతుంటారు. అలాగే చాలా నమ్మకంగా ఇంట్లో మనిషిలా మెలుగుతుంది శునకం. దొంగలు పడుకుండా ఇంటికి కాపలాగా ఉండటమే కాకుండా మనకు ఇంట్లో వ్యక్తులకు ఏదైనా జరిగితే సాటి మనుషుల కన్నా ముందు ఇదే బాధపడిపోతుంది. అందుకే కుక్కను పెంచేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. దానితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో కుక్కకు చనిపోతే ఘనంగా వీడ్కోలు పలకడమే కాదు..దశదిశ కర్మ జరిపిన ఘటనలు, శ్రీమంతం చేసిన సంఘటనలు చూశాం. ఇప్పుడు ఓ కుక్కను యజమానులు ఊరంతా ఊరేగించారు. ఇంతకు అది చేసిన ఘనకార్యం ఏంటనేగా..

తప్పిపోయిన కుక్క తిరిగి వచ్చిందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన యాజమాన్య కుటుంబం ఊరంతా ఊరేగించిన ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. కుక్కకు పూల మాల వేసి ఊరేగించి, విందు ఏర్పాటు చేశారు. ఇంతకు ఆ కుక్క ఎలా తప్పిపోయిందంటే..? ఈ శునకాన్ని యజమానులు, ఆ ఊరి గ్రామ వాసులు మహారాజ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మహారాజ్ యజమాని కమలేష్ కుమార్ కలిసి ఇటీవల దక్షిణ మహారాష్ట్రలోని తీర్థ యాత్రల నిమిత్తం పంధర్ పూర్ వెళ్లింది. ప్రతి ఏడాది ఆషాడ ఏకాదశిలో జరిగే ఉత్సవాల్లో కమలేష్ వెళుతుంటాడు. అలా అతడి వెంట వెళ్లింది. దీన్ని కూడా భక్తి భావం చాలా ఎక్కువట. భజనలు వినడం, భక్తి పాటలు వినడం ఇస్టమట. అలా అక్కడకు వెళ్లాక.. రద్దీ నేపథ్యంలో కుక్క మిస్ అయ్యింది.

ఓ ఆలయాన్ని సందర్శించి బయటకు రాగా అక్కడ మహారాజ్ లేదు. దీంతో ఎవరైనా చూశారా అని అడగ్గా.. వేరో వ్యక్తితో వెళ్లినట్లు చూశామని అక్కడి వారు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. జులై 14న ఇంటికి తిరిగి వచ్చేశాడు కమలేష్. ఇంట్లో కూడా కుక్క తప్పిపోయినట్లు చెప్పాడు. అయితే ఆ మరుసటి రోజే తలుపు తీస్తుండగా.. ఇంటి ముందు ప్రత్యక్షమైంది శునకం. ఒక్కటే 250 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించి రావడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతడ్ని చూడగానే కుక్క తోక ఊపుతూ ఆకలితో అరుస్తుంది. వెంటనే గమనించిన యజమాని.. వెంటనే దాని పొట్ట నింపాడు. అనంతరం తనకోసం వచ్చేసిన శునకాన్ని ఊరేగించడంతో పాటు ఊరంతా విందు ఏర్పాట్లు చేశారు యజమానులు. ఆ దేవుడే తమ వద్దకు కుక్కను పంపాడని చెబుతున్నారు.