iDreamPost
iDreamPost
గతంలో లాక్ డౌన్ టైంలోనే రిలీజై జీ5లో మంచి పేరు తెచ్చుకున్న వెబ్ సిరీస్ లూసర్. ప్రియదర్శి లాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఉండటంతో దీని మీద ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. దానికి తగ్గట్టే కంటెంట్ ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకుని బాగానే రీచ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ వైవిధ్యమైన కథను ఎంచుకున్న తీరు, పాత్రల ప్రెజెంటేషన్ ఇవన్నీ విమర్శకులను సైతం మెప్పించాయి. ఆ స్ఫూర్తితోనే దానికి కొనసాగింపుగా లూసర్ 2 తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి కావడంతో నాగార్జున ద్వారానే ప్రమోషన్లు చేశారు. మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.
ఇది ఫస్ట్ సీజన్ కి స్వచ్ఛమైన కొనసాగింపు. రైఫిల్ షూటర్ సూరి(ప్రియదర్శి), క్రికెట్ కోచ్ విల్సన్(శశాంక్), బ్యాడ్మింటన్ ప్లేయర్ రూబీ (కల్పిక గణేష్)లు తమ గెలుపు అయ్యాక జీవితపు ద్వితీయార్థంలో ఎలాంటి మలుపులు చవి చూశారు. కొత్త సవాళ్లు ఏమేం ఎదురయ్యాయి లాంటి వాటిని బెస్ట్ చేసుకుని దర్శకులు అభిలాష్ రెడ్డి కనకాల, శ్రవణ్ మదాల దీన్ని రూపొందించారు. గతంతో పోలిస్తే పాత్రల పరంగా మెచ్యూరిటీని బాగా ఇంప్రూవ్ చేశారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కావడంతో బడ్జెట్ ను కూడా పెంచేశారు. ప్రధాన ఆర్టిస్టులు ముగ్గురూ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. ఉన్నంతలో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో వాటిని నిలబెట్టారు.
తీసుకున్న ప్లాట్ బాగానే ఉన్నప్పటికీ మొదటి సిరీస్ లో ఉన్నన్ని బలమైన ఎమోషన్స్ ఈసారి ఆ స్థాయిలో పండలేదు. అలా అని నిరాశపరచలేదు కానీ ఇంకా బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. ల్యాగ్ ఉండటంతో వేలు ఎడిటింగ్ వైపు వెళ్తుంది. విజువల్స్, సీన్లను కూర్చిన తీరు మీద మరింత శ్రద్ధ పెట్టారు కానీ డ్రామా పాలు తగ్గడంతో భావోద్వేగాలు అంతగా పండలేదు. పైగా మూడో సీజన్ కు సిద్ధం కావాలని ముందే ఫిక్స్ అయ్యారు కాబోలు దాని కోసమే కొన్ని లూజ్ ఎండ్స్ వదిలేయడం కొంత మైనస్ అయ్యింది. ఇవన్నీ ఎలా ఉన్నా డీసెంట్ వాచ్ గా లూసర్ 2 రికమండ్ చేయడంలో పెద్దగా ఆలోచించనక్కర్లేదు
Also Read : OTT Release : థియేటర్ అనే మంకుపట్టు ఇప్పుడు లేదు