అర్జెంట్ గా రూ.10 వేలు అప్పు కావాలా? ఇలా చేయండి చాలా ఈజీ!

అర్జెంట్ గా రూ.10 వేలు అప్పు కావాలా? ఇలా చేయండి చాలా ఈజీ!

అర్జెంట్ గా రూ.10 వేలు అప్పు కావాలా? ఇలా చేయండి చాలా ఈజీ!

మనిషి జీవితం డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరు అవున్నాకాదన్నా.. డబ్బు ఉన్నవారికి అందే అవకాశాలు, గౌరవాలు.. డబ్బులేని వారికి దక్కవు. ఇలాంటి మర్యాదులు పక్కన పెడితే.. చాలా కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటాయి. అప్పు చేస్తూ కుటుంబాలను నెట్టుకోస్తుంటారు. అయితే  ఇంకా దారుణం ఏమిటంటే.. అప్పులు ఇచ్చే వారుకూడా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఇక మనిషి అవసరాన్ని అవకాశంగా తీసుకుని 10 రూపాయల వరకు కూడా వడ్డీ రేటును పెంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ వడ్డీకి అప్పు దొరికే మార్గాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వినాయక చవితి పండగ వేళ ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

గణనాథుడు పదకొండు రోజుల పాటు పూజలు అందుకుని తిరిగి వచ్చే ఏడాది కలుద్దామంటూ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ పదకొండు రోజులు పిల్లలు, పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు నిర్వహించారు. భక్తులు బొజ్జ గణపయ్యకు పూజలు, భజనలు చేస్తూ మండపాల వద్ద సందడి చేశారు. అంతేకాక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాక ఈ వినాయక చవితి  పండగ సందర్భంగా దాదాపు ప్రతి గ్రామంలో, ప్రతి మండపం వద్ద లడ్డు వేలం పాట నిర్వహిస్తారు. అంతేకాక గణేషుడి నిమర్జనం అనంతరం మిగిలిన డబ్బులు  వచ్చే ఏడాదికి వినియోగిస్తుంటారు.

హైదరాబాద్ లోని బాలాపూర్ వినాయకుడు రూ.27 లక్షల రికార్డ ధర పలికాడు. అంతేకాక బండ్లగూడ ప్రాంతంలోని  ఓ ప్రాంతంలో గణేషుడి లడ్డు రూ.1.24కోట్లు పలికింది. ఇలా వచ్చిన డబ్బును వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే వినాయడుకి డబ్బులను అతి తక్కువ వడ్డీకి  గ్రామాల్లో, పలు పట్టణాల్లో కూడా ఇస్తుంటారు. అయితే ఇలా తీసుకున్న డబ్బులు వచ్చే ఏడాది గణేషుడి పండగ నాడు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. గణేషుడు డబ్బులను కమిటీ సభ్యులు లేదా గ్రామ పెద్దలు.. స్థానికంగా నమ్మకంగా ఉండే వారికి, ముఖ్యంగా రైతులకు అప్పులు ఇస్తుంటారు. గ్రామాల్లో అయితే ఎవరు అడిగిన ఇస్తారు.. కానీ పట్టణాల్లో మాత్రం నమ్మకమైన వారికి మాత్రమే ఇస్తారు. బయట వడ్డీలతో పోల్చితే, ఈ అప్పుకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.

అంతేకాక ఏడాది పాటు సమయం ఇవ్వడంతో రైతులు అయితే పంటల ద్వారా వచ్చిన సంపాదనతో తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేస్తారు. మిగిలిన వారు సైతం  ఈ రుణాలు తీసుకోవడంతో అధిక వడ్డీల భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ మరో సౌలభ్యం  ఏమిటంటే.. ఏడాది వరకు తీసుకున్న అప్పు గురించి మిమ్మల్ని ఎవరూ అడగరు. ఇక ఎవరైన డబ్బులు అవసరం ఉంటే.. మీకు స్థానికంగా వినాయకుడి డబ్బులు అప్పుగా ఇచ్చే అవకాశం ఉంటే.. సదరు కమిటీ సభ్యులను సంప్రదించి.. చాలా ఈజీగా మనీ పొందవచ్చు. మరి.. ఇలా స్వామి వారి డబ్బులను అప్పుగా.. ఇవ్వడం ఏడాది తరువాత తిరిగి చెల్లిండం వంటి విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments