iDreamPost
iDreamPost
ananya pandey- liger:ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిలు కోసం ప్రయత్నిస్తున్న కింగ్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ స్నేహితురాలు అనన్య పాండే వల్ల ఇప్పుడు లైగర్ పరుగులు పెట్టాల్సి వచ్చేలా ఉంది. అందులో తనే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా భాగం పెండింగ్ ఉంది. యుఎస్ లో మైక్ టైసన్ తో చేయాల్సిన షెడ్యూల్ తో పాటు ముంబైలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అందుకే హడావిడి పడకుండా 2022 సమ్మర్ కు వెళ్లాలని టీమ్ నిర్ణయించుకుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్ల కోసం టైం అవసరం అవుతుంది కనక హిందీ నిర్మాత కరణ్ జోహార్ సలహా మేరకు ప్లాన్ మార్చుకున్నట్టు తెలిసింది.
ఇక అనన్య పాండే విషయానికి వస్తే అధికారులు తనను విచారిస్తున్నారు తప్ప అరెస్ట్ చేయలేదు. దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయో లేదో తెలియదు. ఒకవేళ ఆర్యన్ కు బెయిలు వస్తే ఓకే. లేకపోతే ఏదో వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంకేమైనా లింకులు దొరికితే ఈమెకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి అభియోగం లేదు కానీ ఏదో ఉందనే తరహాలో ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకొచ్చిన తలనెప్పని దర్శకుడు పూరి జగన్నాధ్ లైగర్ లో అనన్య తో తీయాల్సిన పోర్షన్ ని ముందుగానే ప్లాన్ చేస్తున్నారట. ఇన్వెస్టిగేషన్ వల్ల తన కాల్ షీట్లకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం లైగర్ షూట్ ముంబై రాయల్ ఫార్మ్స్ వద్ద డ్రీం స్టూడియోలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, అనన్యల మీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. కొడుకు ఆకాష్ కొత్త సినిమా రొమాంటిక్ ప్రమోషన్ల కోసం కొంత బ్రేక్ తీసుకున్న పూరి ఇప్పుడు ఆ పని పూర్తి కావడంతో లైగర్ తో బిజీ అయ్యాడు. త్వరలోనే ఆడియోకు సంబంధించిన అప్ డేట్ బయటికి వచ్చే అవకాశం ఉంది. టీజర్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేనట్టే. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు లైగర్ మీద మాములు ఆశలు లేవు. ఇటీవలే ఓ ఈవెంట్ లో అగ్గి పుట్టిస్తాం అనే రేంజ్ లో చెప్పడం ఫ్యాన్స్ అంచనాలకు ఎక్కడికో తీసుకెళ్లింది.
ALSO READ – రంగమ్మతో శ్రీవల్లి పోలిక – ఏది బెస్ట్