iDreamPost
android-app
ios-app

లైగర్ స్టార్ విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ఆఫర్లు, ఎందుకు హిందీ సినిమాల‌ను రిజెక్ట్ చేస్తున్నాడు?

  • Published Aug 07, 2022 | 1:44 PM Updated Updated Aug 07, 2022 | 1:44 PM
  • Published Aug 07, 2022 | 1:44 PMUpdated Aug 07, 2022 | 1:44 PM
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ఆఫర్లు, ఎందుకు హిందీ సినిమాల‌ను రిజెక్ట్ చేస్తున్నాడు?

ఈ త‌రం ఆడియ‌న్స్ కి విజయ్ దేవరకొండ అంటే చాలా క్రేజ్. ఊపిరి బిగ‌బెట్టి లైగర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రొమోలు, అత‌నికున్న స్టార్ డ‌మ్ ను చూసే, సినిమా విడుదల కాకముందే అతనికి చాలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి లైగర్‌ను బీభ‌త్సంగా ప్రమోట్ చేస్తున్నాడు. అత‌నిలోని సింప్లిసిటీ, స్వాగ్ ఆడియ‌న్స్ కి బాగా న‌చ్చుతోంది. కరణ్ జోహార్ సహ-నిర్మాతగా చేసిన పాన్-ఇండియా చిత్రం కాబట్టి, లైగ‌ర్ తోనే విజ‌య్ బాలీవుడ్ అరంగేట్రం. తెలుగులో లైగ‌ర్ మీద గొప్ప క్రేజ్ ఉంది. సౌత్ లోనేకాదు, నార్త్ అంతా ప్ర‌చారం చేస్తున్నారు. ఏ రేంజ్ లో అంటే..ఇది తెలుగు సినిమానా? లేదంటే బాలీవుడ్ ఫ్లిక్? అని సందేహం వ‌చ్చేటంత‌గా. నిజానికి టాలీవుడ్ ఆడియ‌న్స్ విజ‌య్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎప్పుడూ ముంబైగోలేనా? తెలుగు ఆడియ‌న్స్ ని ప‌ట్టించుకోడా? కొంప‌తీసి బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతాడా?

క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంద‌న్న‌ది ముంబై మీడియా అంచనా. విజయ్ దేవరకొండ అంటే యూత్ లో క్రేజ్. నిర్మాతలు, దర్శకులు అతని పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. లైగర్ థియేటర్లలోకి రాకముందే బాలీవుడ్ నుంచి ఆఫర్లతో విజ‌య్ ని ముంచెత్తున్నాయి. అయితే, అతను ఇంకా బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేయలేదు.

విజయ్ దేవరకొండకు బాలీవుడ్ దర్శకుల నుండి చాలా ఆఫర్లు వచ్చినా, వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ముందు లీగర్ పట్ల ఆడియ‌న్స్ రియాక్ష‌న్ ఏంటో అంచ‌నావేయాల‌నుకొంటున్నాడు. వాళ్ల టేస్ట్ లు ఏంటి? నార్త్ లో ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్స్ సాధించాయో లెక్క‌లేసుకొని ఆ త‌ర్వాతే బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను టేకప్ చేద్దామ‌నుకొంటున్నాడు. అందుకే బాలీవుడ్‌లోని పెద్ద సంస్థ‌ల‌ ఆఫర్‌లను విజ‌య్ తిరస్కరించాడు.

హిందీలో సౌత్ ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తున్నందున, లిగర్ క‌లెక్ష‌న్స్ మీద ఎవ‌రికీ పెద్ద‌గా డౌట్స్ లేవు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగ‌ర్ లో మైక్ టైసన్ కూడా నటించారు. ఇది ఆగష్టు 25, 2022న విడుదల కానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss