iDreamPost
android-app
ios-app

18 ఏళ్లు వచ్చే వరకు ఆడవాళ్లంటే చాలా భయమేసేది, లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ ఇంకా ఏమ‌న్నాడంటే?

  • Published Aug 24, 2022 | 7:19 PM Updated Updated Aug 24, 2022 | 7:19 PM
  • Published Aug 24, 2022 | 7:19 PMUpdated Aug 24, 2022 | 7:19 PM
18 ఏళ్లు వచ్చే వరకు ఆడవాళ్లంటే చాలా భయమేసేది,  లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ ఇంకా ఏమ‌న్నాడంటే?

విజయ్ దేవరకొండ పాన్-ఇండియా చిత్రం లిగర్ రిజ‌ల్ట్ కోసం ఆత్రుత‌గా ఉన్నాడు. కొద్దిగంట‌ల్లోనే ప్రీమియ‌ర్ ప‌డ‌నుంది. ఫ‌స్ట్ టాక్ సోష‌ల్ మీడియాలో రానుంది. అలాగ‌ని లైగ‌ర్ హీరోకి ఎలాంటి టెన్ష‌న్ లేదు. బాయ్ కాట్ ట్రెండ్ ను కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. బెదురులేని యాటిట్యూడ్ ని బాలీవుడ్ కి చూపిస్తున్నాడు. లైగ‌న్ లోబాలీవుడ్ నటి అనన్య పాండే సరసన నటించాడు. రిలీజ్ కు ముందురోజు బాలీవుడ్ మీడియాకు ఇంట‌ర్వ్యూలిచ్చాడు.

ఒకప్పుడు అమ్మాయిలంటే చాలా భ‌య‌ప‌డ్డాను. వాళ్ల వంక చూడ‌లేదు, మాట్లాడ‌లేద‌ని చెప్పాడు. తన గురించి రెండు నిజాలు, ఒక అబద్ధం చెప్పమని విజయ్ ని అడిగినప్పుడు, నాకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అమ్మాయిలంటే చాలా భయపడ్డాన‌ని చెప్పాడు.

ఒక అమ్మాయిని కళ్లలోకి చూసి, మాట్లాడేందుకు నాకు ధైర్యంలేదు. అబ్బాయిల బోర్డింగ్ స్కూల్‌లో పెరిగాను కాబట్టి, అమ్మాయిలు వేరే జాతి లాంటి వారని నేను అనుకున్నా. గ్రహాంతర జీవుల్లా అనిపించారని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆ భ‌యం పోయింది. వాళ్ల‌తో ఫ్రెండ్ షిప్ చేయ‌గ‌లుగుతున్నాన‌ని ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

విజయ్ దేవరకొండ త‌న బాడీని త‌గ్గ‌ట్టుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందే అండర్ డాగ్ బాక్సర్ పాత్రను లిగ‌ర్ లో పోషించాడు. ఈ సినిమాలో బాక్సర్ మైక్ టైసన్ తో ఫైట్ చేయ‌నున్నాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రిజ‌ల్ట్ కొద్ది గంట‌ల్లోనే బైట‌కు రానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss