iDreamPost
android-app
ios-app

Liger : “లైగర్” థండర్ పంచ్ అదిరిపోయిందిగా!

  • Published Dec 31, 2021 | 8:53 AM Updated Updated Dec 31, 2021 | 8:53 AM
Liger : “లైగర్” థండర్ పంచ్ అదిరిపోయిందిగా!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఎన్నో నెలల నుండి ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘లైగర్’ సినిమా మొదటి గ్లిమ్ప్స్ విడుదల చేశారు. ఊహించిన విధంగానే, ఈ చిత్రం యొక్క మొదటి గ్లిమ్ప్స్ విజయ్ దేవరకొండ అభిమానులను ఉత్తేజపరిచేందుకు అవసరమైన అన్ని అంశాలను కలిగి ఉంది.

ఈ గ్లిమ్ప్స్ లో విజయ్ దేవరకొండ అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం మరియు అద్భుతమైన విన్యాసాలు చేయడం మనం చూడవచ్చు. ఈ సీన్స్ థియేటర్‌లలో ఖచ్చితంగా దుమ్ము దులిపేలా ఉన్నాయి.

‘లైగర్’ చిత్రం ముంబై వీధుల్లో పుట్టి పెరిగిన వ్యక్తి కిక్‌బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా మారే కథలా అనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కిక్‌బాక్సర్‌గా కనిపించనున్నాడు. గ్లిమ్ప్స్ లో, విజయ్ పాత్ర ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కాలు మోపుతున్నట్లుగా చూపించారు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ కొన్ని డేర్‌డెవిల్ స్టంట్ సన్నివేశాలను ప్రదర్శించాడు మరియు ఇది నిస్సందేహంగా విజయ్ అభిమానులకు నిజమైన కొత్త సంవత్సర ట్రీట్ అవుతుంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు అనన్య పాండే, మైక్ టైసన్, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, అలీ బాషా, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను, అబ్దుల్ క్వాదిర్ అమీన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని అందించగా, తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి ట్యూన్‌లు సమకూరుస్తున్నారు. సాంకేతిక బృందం సినిమాటోగ్రాఫర్‌గా విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్‌గా జానీ షేక్ మరియు స్టంట్ కోఆర్డినేటర్‌గా డేనియల్ బాల్కోని ఉన్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా & హీరో యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు

‘లైగర్’ ఆగస్ట్ 25, 2022న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read : Valimai Trailer : కార్తికేయకి అక్కడ బ్రేక్ దొరికితే పండగే