Arjun Suravaram
LIC's JEEVAN UTSAV: భారతీయ జీవిత బీమా కంపెనీ(ఎల్ఐసీ)గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల బీమా పాలసీలు వినియోదారులకు అందిస్తూ ఉంది. తాజాగా మరో అదిరిపోయే పాలసీని ఎల్ఐసీ ప్రారంభించారు.
LIC's JEEVAN UTSAV: భారతీయ జీవిత బీమా కంపెనీ(ఎల్ఐసీ)గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల బీమా పాలసీలు వినియోదారులకు అందిస్తూ ఉంది. తాజాగా మరో అదిరిపోయే పాలసీని ఎల్ఐసీ ప్రారంభించారు.
Arjun Suravaram
ప్రతి మనిషి జీవితం ఎంతో విలువైంది. ఇక లైఫ్ అనేది సంతోషంగా సాగాలంటే..ఆర్థిక ప్రణాళికలు ఎంతో ముఖ్యంగా. అవి సరిగ్గా లేకుంటే..జీవితం చివరి దశలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందు.. మన దేశంలో అనేక రకాల బీమా సంస్థలు పలు రకాల స్కీమ్స్, పాలసీలు అందిస్తుంటాయి. వీటిల్లో సరైనవి ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెడితే.. లైఫ్ లాంగ్ మంచి రిటర్న్స్ వస్తుంటాయి. తాజాగా ఎల్ఐసీ సంస్థ ఓ కొత్త ప్లాన్ తీసకొచ్చింది. దీనిలో 5ఏళ్లు కడితే..లైఫ్ లాంగ్ రిటర్న్స్ వస్తుంటాయి. ఆ కొత్త పాలసీ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ జీవిత బీమా కంపెనీ(ఎల్ఐసీ)గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల బీమా పాలసీలు వినియోదారులకు అందిస్తూ ఉంది. అలానే మారుతున్న కాలాన్ని బట్టి ఎల్ఐసీ సంస్థకు తన కస్టమర్లకు అనేక రకాల సదుపాయాలను కల్పిస్తుంది. అంతేకాక ఉన్నవినియోదారులతో పాటు మరింత మందిని ఆకట్టుకునేందుకు ఎల్ఐసీ కొత్త కొత్త పాలసీను ప్రారంభిస్తుంది. అలానే తాజాగా జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త్ ప్లాన్ ను ఎల్ఐసీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తోంది. ఈ పాలసీ ప్రత్యేకంత ఏంటంటే.. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం ప్రతి ఏడాది పెట్టుపడిలో 10 శాతం నగదు అందివడం జరుగుతుంది.
నెలకు రూ.4 వేలపైన గ్యారెంటీ రిటర్న్స్ వస్తుంటాయి. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్ కొనుగోలు చేసేందుకు 90 రోజులు వయసు నుంచి గరిష్ట 65 ఏళ్ల వారు అర్హులు. మినిమం బేసిక్ మొత్తం అష్యూర్డ్ రూ. 5 లక్షలుగా ఉంది. జీవన్ ఉత్సవ్ పాలసీ ప్రీమియం చెల్లింపుల టెన్యూర్ ను 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న పాలసీదారులకు సమ్ అష్యూర్డ్ మొత్తంలో నుంచి ప్రతి ఏటా 10 శాతం చొప్పున అర్హులైన వారికి జీవితాంతం చెల్లిస్తుంది. ఒక వేళ పాలసీదారుడు 100 ఏళ్లు వచ్చే వరకు జీవించి ఉన్నా కూడా ఆ 10 శాతం చొప్పన రిటర్న్స్ అందిస్తుంది.
ఒక ఉదాహరణ చూసినట్లు అయితే.. జీవన్ ఉత్సవ్ పాలసీ మినిమం సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలుగా ఉంది. దీనికి 5 ఏళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకున్నట్లు అయితే.. జీఎస్టీతో కలిపి ప్రతి ఏటా దాదాపు రూ. 1.16 లక్షలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ పూర్తైన తర్వాత కూడా మరో 5 ఏళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి ఏడాది నుంచి సమ్ అష్యూర్డ్ లో ప్రతి ఏడాది మీకు 10 శాతం వస్తుంది. ఇంకా చెప్పాలంటే…మీరు రూ. 5 లక్షల ప్లాన్ ఎంచుకున్నారు, అందులో 10 శాతం అంటే మీ చేతికి రూ. 50 వేలు ప్రతి సంవత్సరం వస్తాయి. మీ లైఫ్ టైమ్ ఈ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ ప్రకారం చూసుకుంటే నెలకు రూ.4,166 చొప్పున అందుకోవచ్చు.
ఈ పాలసీ తీసుకోవాలనుకుంటున్న వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రీమియం చెల్లింపు టర్మ్ ఎంచుకునే దాని బట్టి మనం రిటర్న్స్ తీసుకునే పీరియడ్ మారుతుంటుంది. అలానే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బీమా కవరేజీ రూ. 5 లక్షలు అతని కుటుంబానికి అందుతుంది. ఇది కేవలం సహజ మరణానికి వర్తిస్తుంది. ఒక వేళ ప్రమాదాలు, ఇతర కారణలకు సంబంధించిన బెనిఫిట్స్ పొందాలంటే…ప్రీమియం కాస్త ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. మరి..ఎల్ఐసీ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. సంబంధితి వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ కొత్త పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.