దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన లియో మూవీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. అందుకు కారణం LCU. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. ఆ యూనివర్స్ లో లియోని భాగం చేయబోతున్నాడని.. ఎలా లింక్ చేస్తారనే ఆసక్తితో ఆడియన్స్ అంచనాలు స్ట్రాంగ్ గా పెట్టేసుకున్నారు. కాగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అక్టోబర్ 19న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకుంది లియో.
ఇక కోలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న మూవీగా లియో నిలిచింది. టార్గెట్ కి తగ్గట్టుగా సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుందనే నమ్మకం కూడా ఫ్యాన్స్ లో, కోలీవుడ్ వర్గాలలో కనిపిస్తుంది. అయితే.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పక్కాగా ఫ్యాన్స్ కోసం తెల్లవారు జామున బెనిఫిట్ షోలు వేయాలని మాట వినిపిస్తుంది. ప్రస్తుతం లియో ఏకంగా రూ. 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. కాగా.. లియో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు, 7 గంటలకు స్పెషల్ షోస్ వేయాలని మేకర్స్ తమిళనాడు గవర్నమెంట్ ని కోరారు. కానీ.. గవర్నమెంట్ నాలుగు షోలు కాకుండా ఎక్సట్రాగా ఉదయం 9 గంటలకు ఓ షో వేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.
కట్ చేస్తే.. ప్రభుత్వం ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదని.. కోర్టును ఆశ్రయించారు నిర్మాతలు లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి. ఫ్యాన్స్ కోసం వేసే మార్నింగ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం అంటే.. అక్టోబర్ 17న విచారణ జరుపనుంది న్యాయస్థానం. మరి లియో మూవీ బెనిఫిట్ షోలకు సంబంధించి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? చివరిగా ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఎక్సట్రా షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన తమిళనాడు గవర్నమెంట్.. ఎందుకు బెనిఫిట్ షోలకు ఇవ్వడం లేదని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి లియో మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.