iDreamPost
iDreamPost
శాసన మండలిలో పరిపాలన వికేంద్రికరణ బిల్లును, సి.ఆర్.డిఏ రద్దు బిల్లును తెలుగుదేశం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల నిరసనలు వ్యక్తమౌతున్నాయి. గత రాత్రి విశాఖలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా , తాజాగా కర్నూలులో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని లాయర్లు ముట్టడించారు. తెలుగుదేశం ఫ్లెక్సీలను చించివేసి చెప్పులతో కొట్టారు. లాయర్ల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టి బొమ్మను తలగపెట్టడానికి ప్రయత్నించగా పొలీసులు అడ్డుకున్నారు. దీంతో లాయర్లు చంద్రబాబు ద్రోహి, రాయలసీమ ద్రోహి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
60 సంవత్సరాల నుండి రాయలసీమ రాజధాని కోసం వేచి ఉంటే.. 4 ఏళ్ల అమరావతి కోసం తమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారా అని రాయలసీమ వాసులు రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. రాయలసీమలో ఎమ్మెల్సీలు ఏం మొహం పెట్టుకొని వస్తారని నిలదీశారు. కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర మోహన్, జనరల్ సెక్రెటరీ గోపాల కృష్ణ, శంకర్ సింగ్, రవి కాంత్ ప్రసాద్, భగత్, లక్ష్మణ్, తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే శాసన మండలి ఛైర్మన్ పదవిలో కొనసాగే అర్హత షరీఫ్ కు లేదని తక్షణం రాజీనామా చేయాలని డిప్యుటి సి.యం మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు, సెలెక్ట్ కమిటి పంపాలన్నా నిర్ణయం ఓటింగు జరగకపొతే చెల్లదని చెప్పుకొచ్చారు. ఒక పక్క మండలి లో ఛైర్మన్ నిర్ణయం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమౌతుంటే మరో పక్కన మండలిలో తెలుగుదేశం వ్యవహరనిచిన తీరు పై ప్రభుత్వం ఆగ్రహం తో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనేదానిపై సర్వత్ర ఉత్కఠం రేపుతున్న అంశం.