iDreamPost
android-app
ios-app

రాజధాని కమిటీపై కోర్టుకెక్కిన న్యాయవాది

రాజధాని కమిటీపై కోర్టుకెక్కిన న్యాయవాది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. కొందరు మూడు రాజధానుల నిర్ణయం సబబే అని జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు తుగ్లక్ నిర్ణయమని తిట్టిపోస్తున్నారు.

కాగా రాజధాని అభివృద్దితోపాటుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అభివృధ్ధికోసం ఏర్పాటు చేసిన GN రావు కమిటీ తుది నివేదిక తరువాత రాష్ట్రప్రభుత్వం నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.GN రావు కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం GO 585 ను విడుదల చేసింది. అయితే 585 జీవోని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల దగ్గర భూమి తీసుకుని, తిరిగి కమిటీ వేయడం సరికాదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెంటనే జీవోను రద్దు చేయమని పిటిషనర్ కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఫిబ్రవరి 3లోగా వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిభ్రవరి 3 కి వాయిదా వేసింది.