iDreamPost
android-app
ios-app

రానా సినిమాకు రాజ మార్గం ?

  • Published Jun 28, 2021 | 5:40 AM Updated Updated Jun 28, 2021 | 5:40 AM
  • Published Jun 28, 2021 | 5:40 AMUpdated Jun 28, 2021 | 5:40 AM
రానా సినిమాకు రాజ మార్గం ?

నిన్నటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నిర్మాణమైన సినిమాలు ఓటిటిలో వచ్చేస్తాయన్న వార్తలతో అన్ని మీడియాలు హోరెత్తిపోయాయి. సదరు బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా వీటిని ఖండిస్తూ కూడా ఎలాంటి స్టేట్ మెంట్ లేదు. నిర్మాత సురేష్ బాబుకు ఇదంతా తెలియదని కాదు. ట్రెండ్స్ మీద చాలా అలెర్ట్ గా ఉండే ఆయన టీమ్ ఈపాటికే మొత్తం వివరించి ఉంటారు. అయినా కూడా మౌనంగా ఉన్నారంటే ఏదో గుట్టు ఉండే ఉంటుంది. వెంకటేష్ నారప్ప, ఎఫ్ 3లలో ప్రైమ్ ఒకటి హాట్ స్టార్ ఒకటి డీల్ చేసుకున్నాయన్న వార్తల నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యాన్స్ కొంత అయోమయంలో ఉన్న మాట వాస్తవం.

ఇప్పుడు విరాట పర్వం వంతు వచ్చింది. రానా సాయి పల్లవి కాంబోలో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంది. 90వ దశకంలో తీవ్రంగా ఉన్న నక్సలైట్ నేపధ్యాన్ని తీసుకుని ఇంటెన్స్ డ్రామాగా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సీరియస్ సబ్జెక్టులు జనానికి కనెక్ట్ కావడం అంత సులభం కాదు. అందులోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతో కరోనా థర్డ్ వేవ్ వస్తుందేమో అన్న భయాలతో జనాన్ని హాళ్ల దగ్గర మరీ ఎక్కువ ఆశించలేం. అలాంటప్పుడు కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండే విరాట పర్వం లాంటి మూవీస్ కు థియేటర్ అయితే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది.

అసలు ఇదంతా నిజమా కదా అనేది సురేష్ నుంచి ఏదైనా ప్రకటన లాంటిది వస్తే బెటర్. ఒకవేళ ఓటిటి కన్ఫర్మ్ అయితే మాత్రం ప్రొడక్షన్ హౌస్ ఏమి చెప్పడానికి ఉండదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ముందుగా సదరు డిజిటల్ సంస్థ నుంచి రావాలి. ఆ తర్వాతే నిర్మాత ప్రమోషన్ చేసుకోవాలి. అందుకే ఇంకొద్ది రోజులు వేచి ఉండక తప్పదు. విరాట పర్వంలో ప్రియమణి, నందితా దాస్ తదతరులలు ఇతర కీలక పాత్రలు పోషించారు. డాక్టర్ నుంచి నక్సలైట్ గా మారిన ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రానా కనిపించబోతున్నట్టు తెలిసింది. సో ఇంకొద్దిరోజులు ఆగి చూస్తే తప్ప స్పష్టత వచ్చేలా లేదు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio