iDreamPost
android-app
ios-app

రాజమౌళి సంతృప్తికి అంతం ఉండదు

  • Published Sep 19, 2021 | 8:22 AM Updated Updated Sep 19, 2021 | 8:22 AM
రాజమౌళి సంతృప్తికి అంతం ఉండదు

ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉన్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తలలు పండిన సినీ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. అక్టోబర్ 13 నుంచి మరోసారి వాయిదా పడ్డాక రాజమౌళి టీమ్ ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. 2022 సంక్రాంతికి వస్తుందన్న పుకార్లకు స్పందించడం లేదు. అసలు దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎప్పుడైతే చక్కబడి కరోనా పూర్తిగా మాయమై వందశాతం థియేటర్లు అన్ని రాష్ట్రాల్లో తెరుచుకున్నప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ విడుదల సాధ్యమవుతుంది. అప్పటిదాకా నో వే. ఇంకో ఆరు నెలలైనా ఏడాదైనా ఎదురు చూడక తప్పదు. తారక్ చరణ్ ఫ్యాన్స్ సుదీర్ఘ ఎడబాటుని భరించాల్సిందే.

ఇదిలా ఉండగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒలీవియా మోరిస్ మీద చిత్రీకరించిన లవ్ ట్రాక్ పట్ల జక్కన్న అంత సంతృప్తిగా లేడని అందుకే మళ్ళీ దాన్ని రీ షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇది నిజమో కాదో కానీ మొత్తానికి ప్రచారమైతే జోరుగా ఉంది. లగాన్ లో అమీర్ ఖాన్ బ్రిటిష్ రాణి మధ్య ఉండే ఎపిసోడ్ తరహాలో ఆర్ఆర్ఆర్ ట్రాక్ కూడా మంచి ఎమోషనల్ గా సెట్ చేశారట. అయితే ఆశించిన స్థాయిలో తాను అనుకున్నది రాలేదని అందుకే రాజమౌళి ఇంకొంత టైం తీసుకుని మళ్ళీ షూట్ చేసినా ఆశ్చర్యం లేదని సమాచారం. జక్కన్న అడిగితే తారక్ మాత్రం కాదంటాడా. ఇద్దరూ పర్ఫెక్షన్ కోసం తపించేవాళ్లే.

ఆర్ఆర్ఆర్ కు ఏర్పడ్డ సందిగ్దత మిగిలిన నిర్మాతలకు సైతం ఇబ్బందిగా మారింది. సంక్రాంతిని ఇప్పటికే లాక్ చేసుకున్న సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లు ఇప్పుడు కనక రాజమౌళి ఫిటింగ్ పెడితే ఎలా అనే ఆలోచనలో పడ్డాయి. జనవరి 8కి ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ లో ఉందనే వార్త అభిమానుల్లోనూ కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఇదేమి లేదు బాహుబలి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వేసవికి పోస్ట్ పోన్ చేస్తారనే వాళ్ళు కూడా లేకపోలేదు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ గ్రాండియర్ లో శ్రేయ, అజయ్ దేవగన్, సముతిరఖని తదితరులు ఇతర తారాగణం