iDreamPost
android-app
ios-app

150 సీసీ కెమెరాల కళ్ళు కప్పి.. అర్ధరాత్రి హాస్టల్‌ గోడ దూకి పారిపోయిన విద్యార్థినులు

  • Published May 10, 2022 | 5:39 PM Updated Updated May 10, 2022 | 5:39 PM
150 సీసీ కెమెరాల కళ్ళు కప్పి.. అర్ధరాత్రి హాస్టల్‌ గోడ దూకి పారిపోయిన విద్యార్థినులు

చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ సాంప్రదాయ పాఠశాల మరియు హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోవడం కలకలం సృష్టించింది. చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదివే నలుగు విద్యార్థినులు కాలేజీలో చదువుకొని, ఇక్కడ హాస్టల్ లో ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఆ నలుగురు గోడ దూకి పారిపోయారు.

పోలీసుల కథనం ప్రకారం విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు వెళ్లారని తెలిపారు. అయితే వారి పేర్లు, వివరాలు వెల్లడించలేదు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. హాస్టల్‌ ఇన్‌చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్‌ వెనుక వైపు ఉన్న 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయినట్టు సమాచారం.

అయితే ఈ హాస్టల్ లో దాదాపు 350 మంది విద్యార్థులు ఉన్నారు, 150 సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లందరి కళ్ళు కప్పి ఎలా పారిపోగలరు అంటూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి తల్లితండ్రులకి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఆ 150 సీసీ కెమెరాల ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.