నీట మునిగిన లేడీస్ హాస్టల్.. సాయం కోసం విద్యార్థుల ఎదురు చూపు

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయ్యాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద నీటి ఉధృతి గంట గంటకు పెరుగుతుండడం విశేషం. ఇక ఏజెన్సీ ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. దీంతో ఆదివాసీ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇదే కాకుండా మేడారం జంపన్న వాగుకు వరద నీరు ఎక్కువవడంతో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం మొత్తం నీటితో మునిగిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో పక్క వరంగల్ హాంట్ రోడ్డులో ఉన్న ఓ లేడీస్ రెడిడెన్షియల్ హాస్టల్ చుట్టూ వరద నీరు చేరింది.

దాదాపుగా 200 మందిపైకి పైగా విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి నుంచి బిక్కుబిక్కు మంటు బిల్డింగ్ పైకి ఎక్కి సాయం చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తపై సహాయక చర్యలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని, అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సైతం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనికి సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారతున్నాయి.

ఇది కూడా చదవండి: వీడియో: దంచి కొడుతున్న వానలకు నీటమునిగిన మేడారం

Show comments